Begin typing your search above and press return to search.

'రాజ్ తరుణ్ సిగరెట్స్ ఎక్కువ తాగడం వల్ల టోన్ పోయి డబ్బింగ్ లేట్ అయింది'

By:  Tupaki Desk   |   17 Sep 2020 11:30 AM GMT
రాజ్ తరుణ్ సిగరెట్స్ ఎక్కువ తాగడం వల్ల టోన్ పోయి డబ్బింగ్ లేట్ అయింది
X
టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ నటించిన 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా'లో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ''ఒరేయ్ బుజ్జిగా'' విడుదల కానుందని మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మించారు. 'గుండజారి గల్లంతయ్యిందే' 'ఒక లైలా కోసం' ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో మాళవిక అయ్యర్ - హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించారు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని మార్చి 25న విడుదల చేయాలని ప్లాన్ చేసుకోగా కరోనా లాక్‌ డౌన్ కారణంగా ఆగిపోయింది. అయితే ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశాలు లేకపోవడంతో ఓటీటీలో రిలీజ్ కి రెడీ చేశారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా ముందుగా రికార్డ్ చేసిన కొన్ని ఇంటర్వ్యూలను యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు.

కాగా, 'ఒరేయ్ బుజ్జిగా' ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ - మాళవిక అయ్యర్ - ప్రొడ్యూసర్ రాధామోహన్‌ - కమెడియన్ సప్తగిరి - డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా పాల్గొని చిత్ర విశేషాలు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా 'రాజ్ తరుణ్ టైం కి వచ్చే యాక్టరేనా? పర్ఫెక్ట్ గా డేట్స్ ఇచ్చిన టైం క... ప్రమోషన్స్ కి చెప్పిన సమయానికి వచ్చే యాక్టరేనా?' అని నిర్మాత రాధామోహన్‌ ని సదరు యాంకర్ ప్రశ్నించగా 'చాలా కోపరేటివ్ ఆర్టిస్ట్' అని ఆయన సమాధానం చెప్పారు. ''ఇది వరకు రాజ్ తరుణ్ గురించి చిన్న చిన్నవి వింటుండే వాడిని.. కానీ మా ప్రొడక్షన్ లోకి వచ్చిన తర్వాత అవన్నీ రూమర్స్ గాసిప్స్ అని అర్థం అయింది.. అతను చాలా కోపరేటివ్.. ఆన్ టైం.. కాకపోతే మధ్యలో కాస్త సిగరెట్స్ ఎక్కువ తాగడం వల్ల టోన్ పోయి డబ్బింగ్ లేట్ చేశాడు.. సిగరెట్స్ తాగకూడదు హానికరం అనే చెప్పే డైలాగ్ ఇప్పుడు అతనితో చెప్పాలి'' అని నిర్మాత చెప్పారు. దీనికి రాజ్ తరుణ్ కల్పించుకొని.. 'ఆల్మోస్ట్ ఇప్పుడు మానేశానని.. ఆ మధ్యలో పూర్తిగా మానేసానని.. ఒకటిన్నర సంవత్సరం బ్రేక్ తీసుకోవడంతో మళ్ళీ అలవాటైందని' చెప్పుకొచ్చాడు.