Begin typing your search above and press return to search.

హిట్టుకోసం ఈ హీరో మరో గేర్ మార్చాల్సిందే..నా??

By:  Tupaki Desk   |   6 March 2021 1:30 PM GMT
హిట్టుకోసం ఈ హీరో మరో గేర్ మార్చాల్సిందే..నా??
X
సినీఇండస్ట్రీలో కొందరు హీరోల పరిస్థితి ప్రస్తుతం చెప్పుకోలేకుండా ఉన్నారు. ఎందుకంటే చేస్తున్న సినిమాలన్ని ఫ్లాప్ అవ్వడమే అందుకు కారణం. అయితే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న హీరోలు ఒకరిద్దరు కాదు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా కుర్రహీరోలు. కెరీర్ ప్రారంభంలో రెండు మూడు వరుస హిట్స్ పడేసరికి ఆ అత్యుత్సాహంలో ఆదరబాదరా అవగాహన లేకుండా సినిమాలు ఓకే చేస్తుంటారు. తీరా అవి థియేటర్ వరకు వచ్చేసరికి బోల్తాకొట్టడంతో నీరుగారిపోతుంటారు. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు యువహీరో రాజ్ తరుణ్. కుమారి21ఎఫ్ సినిమా తర్వాత ఈ హీరో కెరీర్ లో అలాంటి హిట్ పడలేదనే చెప్పాలి.

ఎందుకంటే వచ్చిన సినిమాలన్ని ఫ్లాప్స్ అని తేలిపోయాయి. అలాగని సినిమాలు చేయకుండా ఆగలేదు. చేస్తూనే ఉన్నాడు కానీ మంచి కథలను సెలెక్ట్ చేసుకునే విషయంలో పప్పులో కాలేసాడని చెప్పుకోవచ్చు. మొదట్లో మూడు హిట్స్ పడేసరికి వరుసగా వెనకాముందు చూసుకోకుండా సినిమాలు ఓకే చేసేసాడు. అవన్నీ వరుసగా వాటి ఫలితాలతో నిరాశపరిచాయి. ఎంతకాలం ఈ రొటీన్ లవ్ స్టోరీస్ అనేసరికి.. వెంటనే గేర్ మార్చి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చేసాడు. పవర్ ప్లే అనే పేరుతో తెరకెక్కిన ఆ సినిమా ఇటీవలే థియేట్రికల్ రిలీజ్ అయింది. కానీ ఫలితం చూస్తే మునుపటి సినిమాల మాదిరే రిపీట్ అయింది. మరి లవ్ స్టోరీస్ బోర్ కొట్టాయనే ఈ జానర్ ట్రై చేసాడు. ఇప్పుడు ఇందులో కూడా సక్సెస్ రాకపోయేసరికి తదుపరి ఏ జానర్ ఎంచుకోవాలో ఆలోచనలో పడ్డాడట రాజ్ తరుణ్. చూడాలి మరి ఫ్యూచర్ లో అయినా కంబ్యాక్ హిట్ లభిస్తుందేమో!