రాజ్ తరుణ్ లో కొత్త కోణం చూస్తారు!

Mon Mar 01 2021 10:00:02 GMT+0530 (IST)

Raj Tarun Upcoming Movies Updates

రాజ్ తరుణ్ హీరోగా `గుండె జారి గల్లంతయ్యిందే` ఫేం విజయ్ కుమార్ కొండా తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ `పవర్ ప్లే` మార్చి 5 న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ గత రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ.. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ నటనను ప్రశంసించారు.``పవర్ ప్లేలో రాజ్ తరుణ్ లో మీరు వేరే కోణం చూస్తారు. నేను.. రాజ్ ఈ చిత్రం చేయాలని ప్లాన్ చేసినప్పుడు.. మా ఇద్దరూ కథా రచయితలు నంద్యల రవితో కూర్చుని మొదట ఒక అంశం మాత్రమే చర్చించాం. ప్రేక్షకులు మా సినిమాను ఎందుకు చూడాలి? అన్నదే ఆ పాయింట్. లాక్డౌన్ సమయంలో ప్రేక్షకులు ప్రపంచ సినిమాని అలవాటు పడ్డారు. ఇప్పుడు వారిని ఆకట్టుకోవడం సవాల్ లాంటిదే. కానీ `పవర్ ప్లే` బాగా కుదిరిందని మేము హామీ ఇస్తున్నాం`` అని అన్నారు.

రాజ్ తరుణ్ కి కొంత గ్యాప్ తర్వాత ఈ మూవీతో బౌన్స్ బ్యాక్ అవుతాడనే అభిమానులు ఆశిస్తున్నారు. ఇందులో పూర్ణ- హేమల్- ప్రిన్స్ ప్రధాన పాత్రల్లో నటించిన పవర్ ప్లేని మహీధర్-దేవేష్ వనమలీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించారు.