Begin typing your search above and press return to search.

ఓటీటీ రిలీజ్‌తో బ‌తికిపోయాడు

By:  Tupaki Desk   |   17 Oct 2020 8:50 AM GMT
ఓటీటీ రిలీజ్‌తో బ‌తికిపోయాడు
X
ఉయ్యాల జంపాల‌, కుమారి 21 ఎఫ్, సినిమా చూపిస్త మావ‌ లాంటి వ‌రుస హిట్ల‌తో కెరీర్ ఆరంభంలో మంచి ఊపుమీద క‌నిపించ‌డు యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్. అత‌డి జోరు చూసి ప్ర‌ముఖ నిర్మాత అనిల్ సుంక‌ర త‌న‌తో మూడు సినిమాల‌కు ఒకేసారి ఒప్పందం చేసుకున్నాడు. కానీ రాజ్.. త‌న‌పై నెల‌కొన్న అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. ముందులా హిట్లు ఇవ్వ‌లేక‌పోయాడు. చెప్పుకోవ‌డానికి తొలి మూడు హిట్లు మాత్ర‌మే మిగిలాయి అత‌డికి. కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త లాంటి సినిమాలు ఓ మోస్త‌రుగా ఆడినా.. గ‌త మూణ్నాలుగేళ్ల‌లో వ‌చ్చిన సినిమాల‌న్నీ అత‌డికి నిరాశ‌నే మిగిల్చాయి. గ‌త రెండేళ్ల‌లో అయితే రాజ్ సినిమాలు వ‌చ్చింది వెళ్లింది కూడా తెలియ‌దు. చివ‌ర‌గా అత‌డి నుంచి వ‌చ్చిన ఇద్ద‌రి లోకం ఒక‌టే పెద్ద డిజాస్ట‌ర్ అయింది.

ఈ స్థితిలో రాజ్ ఆశ‌ల‌న్నీ ఒరేయ్ బుజ్జిగా మీదే నిలిచాయి. గుండె జారి గ‌ల్లంత‌య్యిందే, ఒక లైలా కోసం చిత్రాల ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్ కొండా ఈ సినిమాను రూపొందించాడు. ప‌రిస్థితులు బాగుంటే మార్చిలోనే ఈ చిత్రం విడుద‌ల కావాల్సింది. క‌రోనా వ‌ల్ల వాయిదా ప‌డి.. ఈ మ‌ధ్యే ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహాలో ఒరేయ్ బుజ్జిగాను రిలీజ్ చేశారు. పెద్ద‌గా సౌండేమీ చేయ‌లేదీ చిత్రం. రివ్యూలైతే పాజిటివ్‌గా రాలేదు. బిలో యావ‌రేజ్ సినిమాగా తేల్చారు చూసిన వాళ్లు. ఆహాలో ఓ మోస్త‌రుగానే జ‌నాలు ఈ సినిమాను చూశారు. ఐతే ఈ చిత్రం థియేట‌ర్ల‌లో విడుద‌లై ఉంటే మాత్రం ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గ‌లిగేది కాదు. వ‌సూళ్ల ప‌రంగా క‌చ్చితంగా ఫ్లాప్ అయ్యేది. ఓటీటీ సినిమాల ఫ‌లితాన్ని క‌చ్చితంగా తేల్చ‌డం క‌ష్టం. వి, నిశ్శ‌బ్దం లాంటి అంచ‌నాలున్న సినిమాల‌కు వచ్చే స్పంద‌న, వ్యూయ‌ర్‌షిప్‌.. జ‌రిగే చ‌ర్చ‌ను బ‌ట్టి గురించి ఒక అంచ‌నాకు రావ‌చ్చు కానీ.. ఒరేయ్ బుజ్జిగా లాంటి చిత్రాల గురించి ఏమీ చెప్ప‌లేం. చిత్ర బృంద‌మేమో దాన్ని బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా ప్రచారం చేసుకుంటోంది. మొత్తానికి థియేట‌ర్ల‌లో రిలీజ్ కాక‌పోవ‌డం వ‌ల్ల రాజ్ ఫ్లాప్ స్ట్రీక్ ఆగింద‌ని అనుకోవాలి.