లాక్ డౌన్ లో రాజ్ కుంద్రా ‘వీడియోల’ ఆదాయం రోజుకు రూ.8లక్షలు

Wed Jul 21 2021 21:00:01 GMT+0530 (IST)

Raj Kundra videos in lockdown earn Rs 8 lakh a day

అశ్లీల వీడియోలు తీసిన కేసులో అరెస్ట్ అయిన శిల్పాశెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా గురించి ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమవుతోంది.ఆయన అరెస్ట్ తర్వాత విచారణలో ముంబై పోలీసులకు షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి.బాలీవుడ్ లో అవకాశాల కోసం చూస్తున్న మోడల్స్ ను టార్గెట్ చేసుకొని వారిని అశ్లీల వీడియోల్లో నటించమని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు రావడంతో రాజ్ కుంద్రా అతడి బావ ప్రదీప్ బక్షితోపాటు మరో 11 మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.7.5 కోట్లను సీజ్ చేశారు. రాజ్ కుంద్రాకు జూలై 23 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

కెన్నిన్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన 'హాట్ షాట్స్ డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్' అనే మొబైల్ యాప్ ను రాజ్ కుంద్రాతో కలిసి బక్షి సంయుక్తంగా నిర్వహిస్తున్నారని ముంబై జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) మిలింద్ భరంబే తెలిపారు.హాట్ షాట్ ల యాప్ ను ప్రపంచంలోని 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా డౌన్ లోడ్ చేసుకొని వాడేలా రూపొందించారు.

ఇందులో ప్రపంచంలోనే ప్రత్యేకమైన హాటెస్ట్ మోడల్స్ షార్ట్ ఫిల్మ్ లు హాట్ వీడియోలను ప్రదర్శిస్తారు. ఇది ఒక సాఫ్ట్ అశ్లీల యాప్ గా రూపొందించినట్టు తెలుస్తోంది. ఇక ఈ యాప్ నుంచి ఉచితంగా అశ్లీల కంటెంట్ ను డౌన్ లో చేసుకునేలా రూపొందించారు.

ముంబై చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా మారాలని వచ్చే అమాయక నిరుపేద బాలికలను ఈ పనిలో ఇరికించినట్లు పోలీసులు తెలిపారు. పెద్ద సినిమాల్లో పనిచేయిస్తామనే నెపంతో బాలికలను బలవంతంగా ఈ అశ్లీల సినిమాల్లో చేయించేవారని తెలిసింది. అలా బూతు సినిమాలను మొబైల్ యాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేసి లక్షలు సంపాదించేవారని తెలిసింది.

ఈ యాప్  ద్వారా ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారట.. ఈ అశ్లీల కంటెంట్ వీడియోల ద్వారా రాజ్ కుంద్రా అండ్టీమ్ కు రోజుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు సంపాదించేవారట.. పోయిన లాక్ డౌన్ సమయంలో యాప్ కు మరింత ఆదరణ పెరగడంతో రోజుకు రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ ఆదాయం సమకూరిందట.

 అంటే లాక్ డౌన్ లో రాజ్ కుంద్రా ఆదాయం డబుల్ అయ్యిందని పోలీసుల విచారణలో రాజ్ కుంద్రా చెప్పినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని బాలీవుడ్ లో అలజడి రేగుతోంది.