Begin typing your search above and press return to search.

వీడియో గేములతో రాజ్ కుంద్రా 3 వేల కోట్లు ముంచాడా?

By:  Tupaki Desk   |   1 Aug 2021 12:14 PM GMT
వీడియో గేములతో రాజ్ కుంద్రా 3 వేల కోట్లు ముంచాడా?
X
రాజ్ కుంద్రా కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. చాలా మోసాలు చేశాడని ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి. దీనికి శిల్పాశెట్టి సహకారం కూడా ఉందంటున్నారు.

మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ రామ్ కదమ్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ రాజ్ కుందా వీడియో గేముల పేరుతో ప్రజలను రెండున్నర నుంచి మూడు వేల కోట్ల రూపాయల మేర ముంచారని ఆరోపించారు.

రాజ్ కుంద్రా కంపెనీ పేరు వివిఎన్ ఇండస్ట్రీస్.. ఆ కంపెనీ పేరు మీద గాడ్, గేమ్ ఆఫ్ డాట్స్ పేరుతో వీడియో గేమ్ రిలీజ్ చేశారు. ఈ వీడియో గేమ్ ఆడితే డబ్బులు గెలుచుకోవచ్చని ఆశ పెట్టారని.. కానీ ఆడివ వాళ్లకు ఒక్క రూపాయి కూడా ప్రైజ్ మనీ ఇవ్వకుండా లక్షలకు లక్షలు వసూలు చేసి గ్యాంబ్లింక్ కు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు.

శిల్పాశెట్టి ఇమేజ్ నే ఇందుకు ప్రధానంగా వాడుకున్నారని.. ఇది ఆమెకు తెలిసే జరిగి ఉంటుందని బీజేపీ ఎంపీ అంటున్నారు. బాధితులు శిల్పాశెట్టికి ఇంటికి వస్తే కొట్టి పంపేవారని సంచలన ఆరోపణలు చేశారు.

ఇప్పటికే అశ్లీల వీడియోల కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ రాకుండా జైల్లో గడుపుతున్న రాజ్ కుంద్రాకు బీజేపీ ఎంపీ ఆరోపణలు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. చాలా మంది బాధితులు ఉన్నారని ఆరోపించడంతో ఇప్పుడు ఈ కేసులో అటు రాజ్ కుంద్రాకు.. ఇటు శిల్పాశెట్టికి ఉచ్చు బిగుసుకునేలా కనిపిస్తోంది.

దేశంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ఎంపీనే మీడియా ముందు ఆరోపించడంతో ఈ కేసులో బీజేపీ సపోర్ట్ శిల్పాశెట్టి-రాజ్ కుంద్రాకు లేదని.. వారికి చిక్కులు తప్పవన్న చర్చ సాగుతోంది.

అయితే మహారాష్ట్రలో ఇప్పుడు శివసేన , కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పోలీసులు వారిచేతుల్లోనే ఉంటారు. వారు కూడా రాజ్ కుంద్రా కేసును సీరియస్ గా తీసుకున్నారు. మీడియాలో కథనాలతో మహారాష్ట్ర శివసేన సర్కార్ సైతం కేసు విచారణను వేగంగా చేస్తోంది. దీంతో రాజకీయంగా రాజ్ కుంద్రాకు సపోర్టు లేదని ఆయనకు కష్టాలు తప్పవన్న చర్చ సాగుతోంది. దీన్నిబట్టి వారు అంత ఈజీగా బయటకు రాలేరన్న సంగతి అర్థమవుతోంది.