శిల్పా షెట్టిని అరెస్ట్ చేస్తారా?

Sat Jul 24 2021 11:41:54 GMT+0530 (IST)

Raj Kundra and Shipa Shetty Controversy

బాలీవుడ్ నటి శిల్పాషెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్ట్ తో ఇప్పుడు అందరి చూపు శిల్పాషెట్టిపై పడింది. భర్త ఇంత చేస్తున్నా.. ఆమె ప్రమేయం లేదంటారా? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. భర్త చేస్తున్న వ్యాపారాల గురించి కట్టుకున్న భార్యగా శిల్పాషెట్టికి తెలియదా? ఆమె ప్రమేయం లేదా? అన్నది ఆలోచించాల్సిందేనని ముంబై సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది.అయితే రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత ఆయన భార్య బాలీవుడ్ నటి శిల్పా షెట్టి అజ్ఞాతంలోకి వెళ్లింది. శిల్పాషెట్టి బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పోయింది. ఓ దశలో దేశం విడిచి పారిపోతారనే కామెంట్లు వార్తలు కూడా వినిపించాయి. అయితే తనపై వస్తున్న రూమర్లు గాసిప్స్ ఊహాగానాలకు శిల్పాశెట్టి తెరదించింది. భర్త అరెస్ట్ తర్వాత తొలిసారి సోషల్ మీడియాలో పోస్టుతో స్పందించారు.

భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ నేపథ్యంలో శిల్పా షెట్టి భావోద్వేగంతో ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు. లుకింగ్ ఎరౌండ్ అనే టైటిల్ తో ఉన్న పుస్తకంలోని పేజీని స్క్రీన్ షాట్ తీసి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టారు. రచయిత జేమ్స్ థర్బర్ కొటేషన్ ను షేర్ చేశారు. ‘ఆవేశంలో గతాన్ని లేదా భయంతో భవిష్యత్ ను చూసుకోవద్దు.. కానీ నీ చుట్టూ ఉన్న పరిస్థితులపై అవగాహన కల్పించుకో అంటూ తనలోని ఎమోషన్స్ ను శిల్పాషెట్టి బయటపెట్టారు.

శిల్పా శెట్టి పోస్ట్ పెడుతూ ‘ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన కోపం ఆవేశంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వారిని చూస్తే అనవసరపు ఆందోళనకు గురి అవుతాం.. ఆ పరిస్థితుల వల్ల ఏర్పడే భయాందోళనల వల్ల మన విధి నిర్వహణను కోల్పోయే ప్రమాదం ఉంది.. లేదా వ్యాధుల బారినపడటం.. లేదా ప్రాణాలకు ముప్పు కూడా వాటిల్లే ప్రమాదం ఉంది’ అంటూ శిల్పా షెట్టి ఎమోషనల్ గా స్పందించారు.

ఇక తన కొత్త చిత్రం ప్రమోషన్ లో కూడా తాజాగా శిల్పాశెట్టి పాల్గొంది. శుక్రవారం ఓటీటీలో విడుదలైన ఈ చిత్రాన్ని చూడాలని నెటిజన్లను కోరడానికి నటి శిల్పాషెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లింది. 'హంగామా 2' మొత్తం టీం మిమ్మలను కడుపుబ్బా నవ్విస్తుందని.. ఈ సినిమా కోసం టీం అంతా ఎంతో కష్టపడ్డామని.. ఈ చిత్రం తన వల్ల దెబ్బతినకూడదని.. అందరూ చూడాలని’ ఆమె కోరారు. తన వ్యక్తిగత సమస్యల నుంచి ‘హంగామా2’ను వేరుగా చూడండని.. నెటిజన్లు ఆ సినిమాపై కామెంట్ నెగెటివ్ ప్రచారం చేయవద్దని శిల్పా కోరారు. హంగామా2ను తన వ్యక్తిగత విభేదాలతో పోల్చవద్దని.. విడిచిపెట్టాలని విన్నవించారు.

భర్త చేస్తున్న అశ్లీల వ్యాపారం గురించి ఖచ్చితంగా శిల్పాషెట్టికి తెలిసి ఉంటుంది. ఆ మధ్య స్పెషల్ షోలో ‘మీ భర్త వ్యాపారం ఏం చేస్తాడని ప్రశ్నించగా.. శిల్పాశెట్టి నవ్వి ఊరుకుటుంది’ ఆ వీడియోను ఇప్పుడు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ట్రోల్ చేస్తూ భర్త వ్యాపారాల గురించి శిల్పాషెట్టికి తెలుసు అంటున్నారు.

అయితే నిజానికి శిల్పాషెట్టి వ్యాపకాలు వేరుగా ఉన్నాయి. ఇప్పటికే ఓ భారీ రియాలిటీషోకు జడ్జిగా శిల్పాషెట్టి వ్యవహరిస్తోంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ‘హంగామా2’ చిత్రంలో కూడా శిల్పా నటించింది. ఈ క్రమంలోనే తన కెరీర్ పరంగా తను వెళుతోందని.. భర్త రాజ్ కుంద్రా వ్యాపారాలు వ్యవహారాల్లో అస్సలు శిల్పాషెట్టికి ప్రమేయం లేదని ముంబై సర్కిల్స్ లో అంటున్నారు. ఈ క్రమంలోనే శిల్పాషెట్టిపై విచారణ కానీ.. అరెస్ట్ కానీ ఉండకపోవచ్చన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.