రాజ్ కుంద్రా కేసు: శృంగారానికి - అశ్లీలతకు మధ్య తేడాని వివరిస్తారా..?

Mon Jul 26 2021 17:01:51 GMT+0530 (IST)

Netizens are arguing as two categories

పోర్నోగ్రఫీ రాకెట్ కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి పలు యాప్స్ లో రిలీజ్ చేస్తున్నారనే ఆరోపణలతో రాజ్ కుంద్రాను ఈ నెల 19న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు కస్టడీలో రేపటి వరకు ఆయన్ని విచారించనున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజ్ కుంద్రా వ్యవహారం గురించే చర్చలు జరుగుతున్నాయి.అయితే రాజ్ కుంద్రా మాత్రం ఆ వీడియోలు అశ్లీలమైనవి కాదని.. కేవలం శృంగారపు వీడియోలేనని వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు లేటెస్టుగా ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న తన్వీర్ హష్మి కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 20-25 నిముషాల నగ్న లఘు చిత్రాలు తీసినమాట నిజమేనని ఒప్పుకున్న తన్వీర్.. వాటిని పోర్న్ చిత్రాలని అనలేమని.. సాఫ్ట్ పోర్న్ మూవీలని అనొచ్చని చెప్పినట్లు తెలుస్తోంది. పోర్న్ తో కూడిన కంటెంట్ ఇతర ప్లాట్ ఫామ్స్ లో కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని.. దీనిపై కోర్టుకు వెళ్తానని హష్మీ అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు అసలు శృంగారం అంటే ఏంటి? అశ్లీలం అంటే ఏంటి? రెంటినీ ఏ విధంగా తెలుస్తారు? అనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నెటిజన్స్ రెండు వర్గాలుగా వాదోపవాదాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి సినిమాలలో అశ్లీల కంటెంట్ కి అభ్యంతకర సన్నివేశాలకు సెన్సార్ బోర్డ్ కత్తెర వేస్తుంది. అయితే ఇక్కడ 'A' సర్టిఫికేట్ జారీ చేయడానికి ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారనేది ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటుంది. గత కొన్నేళ్లుగా సినిమాలలో ముద్దు సన్నివేశాలు - బెడ్ రూమ్ సీన్స్ - రొమాంటిక్ సీన్స్ అనేవి సాధారణంగా కనిపిస్తుండం చూస్తూనే ఉన్నాం.

ఇంక ఓటీటీల హవా మొదలయ్యాక వెవ్ సిరీస్ లు - ఒరిజినల్ మూవీస్ లో బోల్డ్ కంటెంట్ ని విచ్చలవిడిగా చూపిస్తున్నారనే వాదన ఉంది. ఈ క్రమంలో శృంగారానికి - అశ్లీలతకు మధ్య గీతను చెరిపేస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తుంటాయి. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ గత కొంతకాలంగా తెరకెక్కించే సినిమాల కంటెంట్ విషయంలో ఎన్నో వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. అవి ఏదొక ఫ్లాట్ ఫార్మ్ లో బయటకు వస్తూనే ఉంటాయి.

'జీఎస్టీ' సినిమాని ఆర్జీవీ ఏ విధంగా తెరకెక్కించారో అందరికీ తెలిసిందే. కానీ అప్పుడు నేరం కానిది రాజ్ కుంద్రా విషయంలో ఎలా నేరం అయిందనేది ఓ వర్గం నెటిజన్స్ వాదన. రాజ్ కుంద్రా తాను తీస్తున్నది అశ్లీలం కాదని.. శృంగారమే అని అంటున్నాడు. దీంతో ఇప్పుడు న్యాయస్థానాలు దీన్ని ఎలా పరిగణిస్తారు?.. శృంగారానికి అశ్లీలతకు మధ్య తేడాని ఏ విధంగా వివరిస్తారు?.. దీనికి నిర్ధిష్ట ప్రమాణాలను ఏమైనా సూచిస్తారా? అనేది చూడాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.