Begin typing your search above and press return to search.

రాజ్ కుంద్రా రాకెట్: పూనమ్ పాండేపై షెర్లిన్ చోప్రా హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   23 July 2021 4:30 PM GMT
రాజ్ కుంద్రా రాకెట్: పూనమ్ పాండేపై షెర్లిన్ చోప్రా హాట్ కామెంట్స్
X
అశ్లీల వీడియోలు రూపొందించి యాప్ లో పెట్టి అమ్మారనే ఆరోపణలపై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రాను కోర్టులో హాజరుపరిచారు. అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని జూలై 23 వరకు కోర్టు పోలీసు కస్టడీకి పంపింది. 45 ఏళ్ల కుంద్రాపై నమోదైన కేసు అశ్లీల వీడియోలు తీయడం.. కొన్ని యాప్‌ల ద్వారా పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసులో ఎవరెవరికి లింకులు ఉన్నాయనే కోణంలో సైబర్ క్రైమ్, పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపై తాజాగా షెర్లిన్ చోప్రా స్పందించింది. రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత పోలీసులు వేగంగా విచారణ జరుపుతున్నారు. కొంత మంది సినీ తారలు ఈ కేసులో తొలిసారి విచారణకు హాజరైన శృంగారతార షెర్లీన్ చోప్రా తాజా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదంలో పూనమ్ పాండేపై షెర్లిన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇటీవల రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత పూనమ్ పాండే స్పందించింది.ఈ వ్యవహారంపై బాలీవుడ్ నటి పూనం పాండే సంచలన వ్యాఖ్యలు చేసింది. అవిప్పుడు వైరల్ గా మారాయి. కుంద్రా అరెస్ట్ పై పూనమ్ పాండే ఒక ప్రకటన విడుదల చేసింది. ‘నా హృదయం శిల్పాశెట్టి, ఆమె పిల్లల గురించే ద్రవిస్తుంది’ అంటూ పూనమ్ ఎమోషనల్ అయ్యింది. ఆమె ఏం చేయాలో నేను ఊహించలేను అని.. 2019లోనే రాజ్ కుంద్రాపై పోలీసులకు ఫిర్యాదు చేశా.. అతడిపై గౌరవీనయ హైకోర్టులో కేసు పెట్టానని’ పూనం హాట్ కామెంట్స్ చేసింది.

ఈ విషయం జ్యూడిషియల్ పరిధిలో ఉంది కాబట్టి నేను నా స్టేట్ మెంట్లను ఇక్కడికి పరిమితం చేయడానికి ఇష్టపడుతానని పూనం అన్నారు. అలాగే పోలీసులపై నాకు పూర్తి నమ్మకం ఉందని.. అశ్లీల చిత్రాలు తీయడం.. వారిని కొన్ని యాప్ ల ద్వారా ప్రచురించడం నేరం అని తెలిపారు.

పూనమ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా షెర్లిన్ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేసింది. ‘తాను ఎక్కడికి పారిపోలేదని.. తనను విచారించారని.. ఈ కేసులో సంబంధం ఉన్న ఆర్మ్స్ ప్రైమ్ సంస్థ గురించి అన్ని విషయాలు పోలీసులతో చెప్పానని.. వాస్తవాలను అధికారులకు వెల్లడించానని తెలిపింది. అనవసరంగా అన్ని విషయాల్లో తనను లాగవద్దని.. పూర్తి వివరణ పోలీసుల ముందు పెట్టానని ఆమె తెలిపింది.

ఈ కేసులో కీలక పాత్రధారులుగా రాజ్ కుంద్రా, అతని టెక్కీ అసోసియేట్ ర్యాన్ జె. తార్పేతో సహా ఇప్పటివరకు కనీసం 12 మందిని పోలీసులు అరెస్టులు చేశారు. వీరిని జూలై 23 వరకు పోలీసు కస్టడీకి ముంబై మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించింది. ఇంతకుముందు అరెస్టయిన తొమ్మిది మందిలో టీవీ నటి గెహ్నా వశిష్ట్,, యాస్మిన్ ఆర్. ఖాన్, , మోను జోషి, ప్రతిభా నాలావాడే, ఎం. అతిఫ్ అహ్మద్, దీపాంకర్ పి. ఖాస్నవిస్, భానుసూర్యు ఠాకూర్, తన్వీర్ హష్మి, , ఉమేష్ కామత్ లు ఉన్నారు.