రాజ్ కుంద్రా కేసు: మోడల్స్ టార్గెట్.. తక్కువ ఖర్చుతో అశ్లీల సినిమాలు

Sun Jul 25 2021 16:12:07 GMT+0530 (IST)

Raj Kundra case Filming of pornographic films with prostitutes

అశ్లీల చిత్రాలు తీసిన కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా కేసులో ఒక్కొక్కటిగా విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆయన భార్య ప్రముఖ నటి శిల్పాశెట్టిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. రాజ్ కుంద్రా కేసులో ఏదో ఒక విషయం బయటపడుతూ సంచలనం అవుతోంది.పోలీసుల విచారణలో రాజ్ కుంద్రా ఎక్కువగా ఒక వర్గం మోడల్స్ ను టార్గెట్ చేసి ఈ రొంపిలోకి లాగేవాడని తేలినట్టు ముంబైలో కథనాలు వెలువడుతున్నాయి. భారత్ లో ఈ అశ్లీల వీడియోలపై ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చెక్ పెట్టినప్పటికీ ఇలా చాటుమాటుగా వీడియోలు తీశారని తేలింది. గత రెండు మూడేళ్లలో అశ్లీల వీడియోల హవా ఎక్కువగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని టార్గెట్ చేస్తున్నారని తెలిసింది.

ముంబైలో కొంతమంది మోడల్స్ ను ఇలాగే వేశ్యలతో అశ్లీల వీడియోలను షూట్ చేశారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారు దొరికితే వారితో కొన్ని నెలల పాటు డీల్ సెట్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు.హీరోయిన్ పూనమ్ పాండే కూడా ఈ హాట్ షాట్స్ యాప్ కోసం అలాంటి ఆఫర్ తోనే లోబరుచుకునే ప్రయత్నం చేశారని వార్తలు వస్తున్నాయి. కానీ ఆమె డైరెక్టుగానే రాజ్ కుంద్రాపై పోలీస్ కేసు నమోదు చేసింది.

తాజాగా ముంబై క్రైం బ్రాంచ్ బృందం మరోసారి శిల్పాశెట్టి -రాజ్ కుంద్రా నివాసానికి చేరుకొని సోదాలు చేస్తున్నట్టు సమాచారం ఈ సోదాల్లో దాదాపు 100కు పైగా అశ్లీల వీడియోల డేటా లభించినట్లు తెలుస్తోంది. ఇక వాటికి ఖర్చు కూడా తక్కువగానే పెట్టారని విచారణలో తేలిందట..ఇ క కేసును మరింత సీరియస్ గా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తీసుకున్నారు. అధికారులు ఏమాత్రం పట్టువిడవడం లేదు.

రాజ్ కుంద్రా ఇంట్లో అలాగే అతడి సన్నిహితుల ఇంట్లో కూడా మరికొన్ని రోజుల వరకూ సోదాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.రాజ్ కుంద్రా బిజినెస్ అసోసియేట్ ర్యాన్ తోర్పేను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. మూడు రోజుల పాటు పోలీసు రిమాండ్ ముగియడంతో ప్రవేశపెట్టారు.

కేసు విషయంలో మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి పోలీసులు తమ కస్టడీని పొడిగించాలని కోరగా అందుకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సన్నిహితులు ఫామ్ హౌస్ లను అలాగే చిన్నపాటి హోటల్స్ లలో అశ్లీల చిత్రాలు షూటింగ్ చేసి యాప్స్ లో విడుదల చేస్తున్నారట.. దీంతో నిర్మాతలు భారీ లాభాలను అందుకున్నారని తెలుస్తోంది.