Begin typing your search above and press return to search.

స్టైలిష్ సెల్ఫీ లుక్కులో మెగాబ్యూటీ..!

By:  Tupaki Desk   |   19 Jun 2021 1:30 AM GMT
స్టైలిష్ సెల్ఫీ లుక్కులో మెగాబ్యూటీ..!
X
దక్షిణాది హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్.. అంటే టాలీవుడ్ గ్లామర్ ప్రియులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఈ భామ తెలుగులో సినిమాలతో పాటు ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది. లక్ష్మీరాయ్ కేవలం తెలుగే కాదు అటు తమిళ.. హిందీ.. కన్నడ.. మలయాళంలో కూడా మూవీస్ చేసింది. కానీ గత రెండేళ్లుగా లక్ష్మి కెరీర్ పరంగా బాగా నెమ్మదించింది. మరి ఆమెనే కావాలని స్లో అయ్యిందా లేక అవకాశాలు రావట్లేదా అనేది తెలియాల్సి ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ పాలసౌందర్యం కలిగిన బ్యూటీ.. ఎల్లప్పుడూ యాక్టీవ్ గానే ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది.

అయితే లక్ష్మీ సినిమాలు అడపాదడపా చేసినా అందాల విందులో మాత్రం రెగ్యులర్ గా అందుబాటులో ఉంటుంది. కెరీర్ పరంగా సంతృప్తి లేకనే లక్ష్మిరాయ్ అనే పేరును రాయ్ లక్ష్మిగా మార్చుకుంది అమ్మడు. అయినా ఎలాంటి ప్రభావం కనిపించలేదట. కానీ ఎలాంటి ఫోటోషూట్ చేసినా గ్లామర్ ఫ్యాన్స్ కోసం హాట్ ఫోటోలను ఇంస్టాలో పంచుకుంటుంది. తాజాగా అమ్మడు జిమ్ లో దిగిన సెల్ఫీ పిక్ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో వయ్యారి అల్ట్రా స్టైలిష్ లుక్కులో కనిపిస్తోంది. అలా హెయిర్ ముడివేసి అందమైన కళ్లతో ఆకర్షిస్తోంది.

అయితే ఈ భామ ఫిట్నెస్ ఫ్రీక్ అనే విషయం బయటపెద్దగా తెలియదు. రెగ్యులర్ వర్కౌట్స్ తో ఒంపు సొంపులు కాపాడుకుంటూ వస్తోంది. అవసరం అయినప్పుడు సారీ టు బికినీ వరకు ఈజీగా వేసేస్తోంది. ఆ మధ్య బాలీవుడ్ ఎంట్రీ మూవీ జూలీ-2లోనే ఏకంగా బికినీ ధరించి ఘాటైన ముద్దు సన్నివేశాలలో నటించింది. సినిమా ప్లాప్ అవ్వడంతో ఎలాంటి లాభం లేకుండా పోయింది. అప్పటినుండి మళ్లీ బాలీవుడ్ వైపు వెళ్ళలేదు. ప్రస్తుతం సౌత్ లోనే సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడైతే లక్ష్మి చేతిలో ఝాన్సీ ఐపిఎస్.. సిండ్రెల్లా.. ఆనందభైరవి.. గ్యాంగ్ స్టర్ 21 సినిమాలున్నాయి. చూడాలి మరి త్వరలో ఏదైనా సినిమాతో ఫామ్ లోకి వస్తుందేమో!