రత్తాలు దెబ్బకు వైరస్ కి అయినా ఒణుకు గ్యారెంటీ!

Wed May 12 2021 16:01:01 GMT+0530 (IST)

Rai Lakshmi Latest Photo

ఓవైపు సెకండ్ వేవ్ కల్లోలం ప్రపంచాన్ని షాక్ కి గురి చేస్తోంది. పొరుగు దేశాలతో పోలిస్తే భారతదేశంలో ధైన్యం నెలకొంది. మన దేశంలో ఈ దుస్థితికి పొరుగు దేశాలు జాలి పడుతున్నాయి. ఇలాంటప్పుడు స్వదేశంలో అందగత్తెల వీరంగా షాక్ కి గురి చేస్తోంది.కొందరు మాల్దీవుల సెలబ్రేషన్ పేరుతో బికినీ బీచ్ ఫోటోలను షేర్ చేస్తూ ఇన్ స్టా సోషల్ మీడియాల్లో ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో ఉన్నారు. తద్వారా వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే లక్షలు కోట్ల లో ఆదాయాన్ని దండుకోవాలన్నది ఆరాటం.

రత్తాలు అలియాస్ రాయ్ లక్ష్మీ ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ అమ్మడు లాక్ డౌన్ సీజన్ ని ఫుల్లుగా సద్వినియోగం చేస్తోంది. ఇంతకుముందు బర్త్ డే పేరుతో తన గాళ్స్ గ్యాంగ్ తో బోలెడంత రచ్చ చేసింది. బికినీ సెలబ్రేషన్స్ పేరుతో ఇన్ స్టాని హీటెక్కించింది. తాజాగా పింక్ బికినీలో క్యాట్ వాక్ చేస్తూ ధడ పుట్టించింది. వైరస్ కి అయినా ఒణుకు గ్యారెంటీ. ఖాళీగా రిసార్ట్ దొరికింది కదా! అని మరీ ఈ రేంజులో చెలరేగిపోతే ఎట్టాగమ్మా రత్తాలూ! అంటూ కొందరు ఘాటైన వ్యాఖ్యల్ని గుప్పిస్తున్నారు. అయినా ఈ రాంగ్ టైమ్ లో అల్లకల్లోలంలో రత్తాలు కల్లోలమేంటో అంటూ కొందరు నసిగేస్తున్నారు.