బాత్ టబ్ లో రత్తాలు ఫీట్లేమిటో కానీ

Wed Apr 21 2021 23:00:01 GMT+0530 (IST)

Rai Lakshmi Latest Photo

రాయ్ లక్ష్మీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో జోష్ చూపించినా కానీ ఎందుకనో టాలీవుడ్ కోలీవుడ్ కనికరించలేదు. ఆ క్రమంలోనే హిందీ చిత్ర సీమలో కొన్నాళ్లు ప్రయత్నించి అక్కడా కుదరక బౌన్స్ బ్యాక్ అయిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం రత్తాలు స్వీయ లాక్ డౌన్ లో ఉంది. ఆ క్రమంలోనే సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తూ హీట్ పెంచుతోంది.
లక్ష్మీ రాయ్ నిస్సందేహంగా సోషల్ మీడియాలో నమ్మకమైన అభిమానాన్ని కలిగి ఉన్న నటి. తన ఆకర్షణీయమైన జీవితం తరచూ  అభిమానులను మురిపిస్తోంది.

తాజాగా స్నానపు తొట్టెలో రత్తాలు విన్యాసాలకు సంబంధించిన ఒక ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇలా స్పైసీ బ్రాలెట్ తో ఈ ఫోటో ఒక్కసారిగా హీట్ పెంచింది.  లేత గోధుమరంగు స్కిన్ టోన్ తో గుండె గుబిళ్లుమనిపిస్తోంది. ``నిజమైన పరిపూర్ణత లోపాలను పరిపూర్ణం చేస్తుంది`` అని లక్ష్మీ రాయ్ ఈ ఫోటోకి శీర్షికనిచ్చారు. ఆమె కోవిడ్ .. లాక్ డౌన్ కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడించారు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. బాలీవుడ్ లో `ఆఫీసర్ అర్జున్ సింగ్- ఐపీఎస్ బ్యాచ్ 2000` అనే చిత్రంలో ఐటెమ్ నంబర్ లో ఆడిపాడుతోంది. అలాగే ఝాన్సీ- సిండ్రెల్లా- ఆనంద భైరవి అనే చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. వీటిలో ఏవైనా రిలీజైతే కానీ భవిష్యత్ సంగతేంటో ఏదీ తేలదు.