ఇంత అందాన్ని ఇలా చూస్తే కుర్రాళ్లు ఏమైపోయేను?

Sun Mar 07 2021 10:00:01 GMT+0530 (IST)

Rai Lakshmi Latest Photo Shoto Photos

రెడ్ సిగ్నల్ కనిపించినా జంప్ చేసి రయ్యిమంటూ బైక్ పై దూసుకెళ్లే కుర్రాళ్లు అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ఒక్కసారిగా బ్రేక్ ని పాతాళానికి తొక్కేయరూ. అగ్నిపర్వతానికి దూరంగా నిలబడే అబ్బాయిలు అగ్గిరాజేసే అందాలను మరీ దగ్గర నుంచి చూడటానికి పోటీపడరూ. అదే అందానికున్న మహత్తు .. అది చేసే గమ్మత్తు. ఊహాసుందరిని చూస్తూ ఉపవాసాలు ఉండేవాళ్లు .. ఊరించే పరువాలను చూస్తూ పస్తులుండేవాళ్లు ఎంతమంది లేరు. అందుబాటులో ఉన్న అందానికి అందరూ బాసులే .. అందరూ దాసులే!కొన్ని అందాలు కంటితెర వరకే వస్తాయి .. మరికొన్ని అందాలు కంటి కిటికీలో నుంచి లోపలికి అడుగుపెట్టేస్తాయి. ఇదిగో ఇక్కడ రాయ్ లక్ష్మీ అందం మాత్రం గుండె తలుపులు తెరిచేసుకుని గభాలున లోపలికి దూరేస్తుంది. అదుపులేని అందాలపై వస్త్రాలను పొదుపు చేస్తే ఎలా ఉంటుందన్నది చెప్పడానికి రాయ్ లక్ష్మీ ఇక్కడ గట్టిగానే ప్రయత్నం చేసింది. ఇక్కడ ఆమెను చూస్తుంటే స్విమ్మింగ్ పూల్ ఒడ్డున పడుచు పాలరాతి శిల్పాన్ని కూర్చోబెట్టినట్టుగా లేదూ. ఆ రంగు చూసి మంచుకొండలు చిన్నబుచ్చుకోవా? ఆ పొంగుచూసి అగ్నిపర్వతాలు అసూయపడవా?
 
పగడాల చెట్టుకు ముత్యాలు పూసినట్టు .. రత్నాల రాశిపై రాజహంస వాలినట్టుగా కనిపిస్తున్న రాయ్ లక్ష్మీని కుర్రాళ్లు అంత తేలికగా మరిచిపోలేరు .. హీటెక్కించే హాటు లుక్కులతో ఆమె మరిచిపోనివ్వదు కూడా. ఇలాంటి ఫొటోలను టైట్ క్లోజప్ లో చూసే కుర్రాళ్లకు వెన్నెలే కాదు .. వెన్నముద్ద కూడా వేడిగానే అనిపించడం సహజం .. అది వయసు నైజం. ఇంతగా ఈ భారీ అందాల భామ కుర్రకారును కమ్మేస్తుండటం వల్లనే ఆమె ఐటమ్ పెట్టడానికి దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. ఆ ఒక్క ఐటమ్ కోసమే టీనేజ్ కుర్రాళ్లంతా థియేటర్లను చుట్టుముడుతున్నారు. అందాలవైపు పరిగెత్తేవాళ్లను అగాధాలు కూడా ఆపలేవని అందుకే అంటారు మరీ!