Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్ మరో 'మన్మథుడు2' స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడా..?

By:  Tupaki Desk   |   26 May 2020 11:50 AM GMT
ఆ డైరెక్టర్ మరో మన్మథుడు2 స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడా..?
X
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వైపు నటుడిగా, మరో వైపు దర్శకుడిగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని.. ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు యంగ్ టాలెంటెడ్ రాహుల్ రవీంద్రన్. ఇటీవలే టాలీవుడ్ మన్మధుడు నాగార్జున హీరోగా 'మన్మథుడు 2' సినిమా రూపొందించి ఘోర పరాజయాన్ని అందుకున్నాడు. గతంలో రూపొందిన సూపర్ డూపర్ హిట్ మన్మధుడు సినిమా పేరుతో హిట్ కంటిన్యూ అవుతుందేమో.. అనుకున్నారు.. కానీ మన్మధుడు2 సినిమా నష్టాలనే కాదు.. ఎన్నో విమర్శలను కూడా తెచ్చిపెట్టింది. మొదట అందాల రాక్షసి సినిమాతో తెలుగుతెరకు హీరోగా పరిచయం అయ్యాడు రాహుల్. ఆ సినిమాలో తన అమాయకమైన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత దర్శకుడిగా మారి 'చిలసౌ' సినిమాను రూపొందించాడు. ఆ సినిమా మంచి హిట్ అవ్వడమే గాక.. మంచి పేరుతో పాటు జాతీయ అవార్డు కూడా తీసుకొచ్చింది. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న రాహుల్ ఖాళీగా ఉండకుండా కొత్త సినిమాలకోసం కథలను రాసుకుంటున్నాడట.

ఓ వైపు వెబ్ సిరీస్ రూపొందించే ప్లాన్ లో కూడా ఉన్నాడు. ప్రస్తుతం వెబ్ సిరీస్ స్క్రిప్ట్ పనులలో బిజీ అయ్యాడట. ఈ వెబ్ సిరీస్ లో యంగ్ హీరో సందీప్ కిషన్ తో పాటు వెన్నెల కిశోర్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. నెట్‌ ఫ్లిక్స్ కోసం ఒరిజినల్ వెబ్ సిరీస్‌ గా ఈ వెబ్ సిరీస్ ను తీయబోతున్నాడు రాహుల్. అయితే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ ర‌వీంద్ర‌న్ ప్రస్తుతం మరో సినిమా స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నాడట. ఆ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నాడట. డైరెక్టర్ గా బిజీ అవ్వడానికి ట్రై చేస్తున్న రాహుల్.. ఈ కొత్త సినిమాను కూడా మన్మధుడు2లో లాగా అడల్ట్ డైలాగ్స్ తో రూపొందించడు కదా..! అని సినీ ప్రియులు అభిప్రాయ పడుతున్నారు. చూడాలి మరి రాహుల్ మరో మన్మధుడు2 తీస్తాడా.. లేక కొత్తగా ఏదైనా ట్రై చేస్తాడా..? ఈ సినిమా పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.