Begin typing your search above and press return to search.

'G** లో దమ్ముంటే సినిమా తీయండి ఇడియట్స్'

By:  Tupaki Desk   |   2 July 2022 7:30 AM GMT
G** లో దమ్ముంటే సినిమా తీయండి ఇడియట్స్
X
ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ కమెడియన్ గా క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు రాహుల్ రామకృష్ణ. 'సైన్మా' అనే షార్ట్ ఫిలిం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్.. 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే సినిమాతో బిగ్ స్క్రీన్ మీదకు వచ్చాడు. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి రాహుల్ కు మళ్లీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

అయితే సినిమాల్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ.. వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలుస్తుంటారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఇతను అన్ని విషయాలపై తన అభిప్రాయాలను నిర్భయంగా చెబుతుంటారు. ఆ మధ్య 'నెట్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ సమయంలో ఓ బూతు పదాన్ని వాడి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు లేటెస్టుగా మరోసారి నోరు జారాడు రాహుల్.

తాజాగా రాహుల్ "G** లో దమ్ముంటే సినిమా తీయండి ఇడియట్స్" అని ట్వీట్ చేశాడు. అయితే కాసేపటికే ఆ ట్వీట్ ని డిలీట్ చేసాడు. కాకపోతే అప్పటికే ఆ ట్వీట్ ని స్క్రీన్ షాట్ తీసుకున్న నెటిజన్లు నెట్టింట వైరల్ చేసేసారు. దీంతో ఆ ట్వీట్ చేసింది నేను కాదు.. అది నా ఆల్టర్ ఇగో అంటూ మరో ట్వీట్ లో అన్నాడు.

ఎవరినీ ప్రస్తావించకుండా ఏ సినిమా గురించో చెప్పకుండా రాహుల్ ఇలాంటి ట్వీట్ ఎందుకు చేయాల్సి వచ్చిందని నెటిజన్లు ఆలోచిస్తున్నారు. అతన్ని రెచ్చగొట్టేలా ఎవరైనా అభ్యంతరకరంగా మాట్లాడారా అనేది తెలియదు. సినిమా రివ్యూకు రాసే క్రిటిక్స్ ను ఉద్దేశించి చేశాడా అనుకోడానికి, అతను నటించిన కొత్త సినిమా ఏదీ నిన్న శుక్రవారం థియేటర్లలోకి రాలేదు.

చివరిగా రాహుల్ నటించిన 'విరాటపర్వం' 'అంటే సుందరానికి' వంటి సినిమాలకు మిశ్రమ స్పందన వచ్చింది. మరి అతను ఈ సినిమాల రివ్యూలను ఉద్దేశించి అలాంటి బూతు కామెంట్ పెట్టాడేమో. ఏదేమైనా రాహుల్ రామకృష్ణ మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇకపోతే ఇటీవల రాహుల్ తనకు కాబోయే భార్యకు లిప్ లాక్ ఇస్తున్న ఫోటోని షేర్ చేసి పెళ్లి కబురు చెప్పిన సంగతి తెలిసిందే. అలానే ఆ మధ్య '2022తో సినిమాలు ఆపేస్తున్నాను. ఇకపై నేను సినిమాలు చేయను. ఎవరేం అనుకున్నా నేను పట్టించుకోను' అని పోస్ట్ చేసి రచ్చ చేసాడు. ఇప్పుడు G***లో దమ్ముంటే అంటూ ట్వీట్ చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు.