Begin typing your search above and press return to search.

లారెన్సుడి రుద్ర తాండ‌వం ఇదుగో

By:  Tupaki Desk   |   23 Jun 2022 12:34 PM GMT
లారెన్సుడి రుద్ర తాండ‌వం ఇదుగో
X
`కాంచ‌న‌` సీరీస్ చిత్రాల‌తో హీర‌ర్ కామెడీ చిత్రాల‌కు కెరాఫ్ అడ్ర‌స్ గా నిలిచారు రాఘ‌వ లారెన్స్‌. `కాంచ‌న 3` త‌రువాత ఆయ‌న నుంచి సినిమా వ‌చ్చి దాదాపు మూడేళ్లు దాటుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌రో ప‌వర్ ఫుల్ మూవీతో ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి రెడీ అయిపోతున్నారు. లారెన్స్ న‌టిస్తున్న తాజా చిత్రం `రుద్ర‌న్‌`. `ఎవిల్ ఈజ్ నాట్ బోర్న్ ఇట్ ఈజ్ క్రియేటెడ్` అని ట్యాగ్ లైన్‌. క‌దిరేశ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఫైవ్ స్టార్ క్రియేష‌న్స్ సంస్థ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

రాఘ‌వ లారెన్స్ సినిమాల్లోనే హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న మూవీని తెలుగులో `రుద్రుడు`గా విడుద‌ల చేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్న ఈ మూవీని క్రిస్మ‌స్ కానుక‌గా ఇదే ఏడాది తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇటీవ‌ల ఈ మూవీ ప్రీ టుక్ ని విడుద‌ల చేసి సినిమాపై అంచ‌నాల్ని పెంచేసిన మేక‌ర్స్ గురువారం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసి ఆ అంచ‌నాల్ని మ‌రింతగా పెంచేశారు.

త‌జాఆగా విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ లో హీరో రాఘ‌వ లారెన్స్ ఇంటెన్స్ అవ‌తార్ లో క‌నిపిస్తున్నారు. ఓ ఫైట్ సీక్వెన్స్ కి సంబంధించి ఈ పోస్ట‌ర్ ని మేక‌ర్స్ విడుద‌ల చేశారు. సినిమాలో యాక్ష‌న్ ఏ రేంజ్ లో వుండ‌బోతోందో.. లారెన్స్ రుద్ర‌తాండ‌వం ఎలా వుంటుందో జ‌స్ట్ శాంపిల్ గా ఈ పిక్ లో చూపించి సినిమాపై హైప్ రి క్రియేట్ చేశారు.

అంతే కాకుండా `ఎవిల్ ఈజ్ నాట్ బోర్న్ ఇట్ ఈజ్ క్రియేటెడ్` అని ట్యాగ్ లైన్ కి త‌గ్గ‌ట్టే లారెన్స్ ఎవిల్ లుక్ లో క‌నిపిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. చేతిలో ఆయుథం ప‌ట్టుకుని విల‌న్ ల‌పై లారెన్స్ రుద్ర తాండ‌వం చేస్తున్న తీరు టెర్రిఫిక్ గా వుంది.

ఈ మూవీకి సంబంధించి విశేషం ఏంటంటే కాంచ‌న కాంబినేష‌న్ రిపీట్ అవుతుండ‌టం. `కాంచ‌న‌`లో టైటిల్ పాత్రని పోషించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకున్న శ‌ర‌త్ కుమార్ ఈ మూవీలోనూ ఓ కీలక పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. లారెన్స్ కు జోడీగా ప్రియా భ‌వానీ శంక‌ర్ న‌టిస్తున్న ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు సైలెంట్ గా 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది.

పూర్ణిమా భాగ్య‌రాజ్‌, నాజ‌ర్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ మూవీకి సంగీతం జీవీ ప్ర‌కాష్ కుమార్, ఫొటోగ్ర‌ఫీ ఆర్ డీ రాజ‌శేఖ‌ర్‌, ఎడిటింగ్ ఆంటోనీ, స్టంట్స్ శివ - విక్కీ అందిస్తున్నారు. ద‌ర్శ‌కుడు క‌దిరేశ‌న్ నిర్మిస్తూ రూపొందిస్తున్న ఈ మూవీపై రాఘ‌వ లారెన్స్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నార‌ట‌. మూడేళ్ల విరామం త‌రువాత లారెన్స్ నుంచి థియేట‌ర్ల‌లోకి రానున్న ఈ మూవీ క్రిస్మ‌స్ సంద‌ర్భంగా భారీ స్థాయిలో తెలుగుచ త‌మిళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధ‌మ‌వుతోంది. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీతో మ‌ళ్లీ లారెన్స్ ట్రాక్ లోకి రావ‌డం ఖాయం అని చెబుతున్నారు.