Begin typing your search above and press return to search.

మాజీ సీఎం భార్య మళ్లీ గ్లామర్‌ రూట్‌

By:  Tupaki Desk   |   1 April 2020 7:15 AM GMT
మాజీ సీఎం భార్య మళ్లీ గ్లామర్‌ రూట్‌
X
కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి గౌడ భార్య అయిన రాధిక గతంలో హీరోయిన్‌ అనే విషయం తెల్సిందే. సినీ నిర్మాణంలో ఉన్న కుమారస్వామికి రాధికతో పరిచయం ఏర్పడటం ఆ పరిచయం పెళ్లికి దారి తీయడం జరిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. కుమారస్వామితో పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన రాధిక మళ్లీ ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. కుమార స్వామి సీఎంగా ఉన్న సమయంలోనే ఈమె రెండు మూడు సినిమాలకు కమిట్‌ అయ్యింది.

రాధిక నటించిన రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సమయంలోనే రాధిక మరింత స్పీడ్‌ పెంచాలని భావిస్తుందట. కన్నడ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈమె యంగ్‌ హీరోలకు జోడీగా నటించేందుకు కూడా ఆసక్తిగా ఉందట. గతంలో మాదిరిగా రొమాంటిక్‌ సీన్స్‌ లో నటించేందుకు కూడా ఓకే అంటోందని చెబుతున్నారు. హీరోయిన్‌ గానే కాకుండా సినిమాల్లో కీలక పాత్రలు చేసేందుకు కూడా ఈమె ఓకే చెబుతోందట.

హీరోయిన్‌ గా 2002 సంవత్సరంలో హీరోయిన్‌ గా కెరీర్‌ ఆరంభించిన రాధిక ఇంకా కూడా రొమాంటిక్‌ సినిమాలు.. పాత్రలు చేస్తానంటే జనాలు ఆసక్తి చూపిస్తారా అనేది చూడాలి. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కాస్త గౌరవప్రధమైన పాత్రలు చేస్తూ కన్నడ ప్రేక్షకులను అలరిస్తే బాగుంటుందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్‌ గానే కొనసాగాలని ఈమె భావిస్తే మాత్రం ప్రస్తుతం ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా ఆ తర్వాత ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.