పిక్ టాక్: 'నగ్నంగానే ఉంది.. కానీ లేదేమో' క్లాసిక్ అహల్య బ్యూటీ!!

Sun Aug 02 2020 08:00:05 GMT+0530 (IST)

Radhika Apte Shared Her Beautiful Pic In Instagram

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రాంగోపాల్ వర్మ రక్తచరిత్ర సిరీస్ సినిమాలతో పరిచయం అయింది. ఈ తమిళనాడు భామకి గ్లామర్ షో చేయడంలో కాస్త దూకుడు ఎక్కువే. అలాగని గ్లామర్ షో చేయడం అనేది ఆమెకి కొత్తేమి కాదు. తెలుగులో ధోనీ లెజెండ్ లయన్ సినిమాలలో ముద్దుగా కనిపించి తన పరిధి మేరకు మెప్పించిన రాధికా.. తెలుగులో ఆమె చేసిన సినిమాలు అన్నింటిలో చాలా పద్ధతిగా కనిపించింది. కానీ అమ్మడు ఇప్పుడు మాత్రం పరిధులు లేనట్లే అనిపిస్తుంది. పెళ్ళైనా సరే సారీ నుండి బికినీ వరకు ధరించడానికి వెనుకాడకుండా రెచ్చిపోతుంది. 2012లో బెనెడిక్ట్ టేలర్ అనే లండన్ మ్యూజిషియన్ ను పెళ్లాడింది. కానీ పెళ్లి అయిందన్న సంగతిని రాధిక పూర్తిగా మర్చిపోయిందని అనిపిస్తుంది. ఇదివరకే పలుమార్లు శృంగార సన్నివేశాల్లో నటించేందుకు తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూనే పెరిగానని.. నటులు వేదికపై నగ్నంగా నటించడాన్ని కూడా చూశానని చెప్పుకొచ్చింది. తన శరీరాన్ని చూసి తానెందుకు సిగ్గుపడాలని రాధికా ఎదురు ప్రశ్న వేస్తుంది. అవసరమైతే ఎలాగైనా నటించేందుకు తాను రెడీనని చెప్పిన రాధికా మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంది. అయితే అమ్మడు తాజాగా సముద్ర తీరాన ఇసుకలో కూర్చొని వేడెక్కిస్తుంది. కానీ ఆ ఫోటో తీసిన వ్యక్తిని మాత్రం అభినందించాలని అందరి భావన. ఎందుకంటే ఆ ఫోటోలో రాధిక నగ్నంగా ఉందని అనిపిస్తుంది కానీ ఆమె నగ్నంగా ఉండదు. ఆ ఫోటో తీసిన విధానం గొప్పగా ఉంది. అందుకే నగ్నంగా ఉందనే ఫీల్ కలిగిస్తూనే ఆమె నగ్నంగా లేదని ఒక భావన కలిగేలా క్లాసిక్ గా తీసాడు. అందుకే ఆ కెమెరామెన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇంతకుముందు `అహల్య` `బద్లాపూర్` వంటి చిత్రాల్లో రాధిక నగ్నంగా కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఓ షార్ట్ ఫిల్మ్ కూడా తీసింది.