స్లిమ్ గా లేకపోవడంతో విక్కీ డోనార్ మిస్ అయిందట

Thu Jun 27 2019 15:11:53 GMT+0530 (IST)

ఈ జెనరేషన్ లో అందరూ వెయిట్ కాన్షియస్ గా ఉంటారు.  ఇక గ్లామర్ ప్రధానమైన ఫిలిం ఇండస్ట్రీలో స్లిమ్ గా ఉండడం అనేది చాలా అవసరం. హీరోలకు వెయిట్ అటూ ఇటుగా ఉన్నా చెల్లుతుందేమో కానీ హీరోయిన్లకు ఓవర్ వెయిట్ ఉంటే మాత్రం చెల్లదు.  ఓవర్ వెయిట్ దాకా ఎందుకు.. నార్మల్ వెయిట్ కంటే  జస్ట్ కొన్ని కిలోలు ఎక్కువ ఉన్నా అవకాశాలు మిస్ అవుతాయి.  రీసెంట్ గా ఒక చాట్ షోలో రాధిక ఆప్టే ఇలానే ఒక ఆఫర్ ను మిస్ అయిన సంగతి వెల్లడించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.  ఈ షోలో ఆయుష్మాన్ ఖురానా కూడా అతిథిగా పాల్గొన్నాడు.రాధిక ఆప్టే స్లిమ్ గానే ఉంటుంది కదా? ఆమె ఎప్పుడు ఓవర్ వెయిట్ ఉంది? అని మీకు అనుమానం రావచ్చుకానీ బాలీవుడ్ స్టాండర్డ్ ప్రకారం స్లిమ్ అంటే మనం అనుకునే స్లిమ్ నెస్ కాదు.. జీరో సైజ్.  బాలీవుడ్ హిట్ ఫిలిం 'విక్కీ డోనార్' లో హీరోయిన్ అవకాశం కోసం ప్రయత్నించిన వారిలో రాధిక కూడా ఒకరట.  కానీ రాధిక వెయిట్ కొన్ని కిలోలు ఎక్కువ ఉందనే కారణంతో ఆ అవకాశాన్ని యామి గౌతమ్ కు ఇచ్చారట.  తను ఆసమయంలో స్లిమ్ గా ఉండి ఉంటే తనకే ఆ హీరోయిన్ అవకాశం వచ్చేదని తెలిపింది.  ఆ సినిమాకు ఆడిషన్ కు హాజరవడానికి ముందే రాధిక ఒక హాలిడేకి వెళ్ళిందట. అక్కడ ఫుల్ గా బీర్లు తాగి.. కంట్రోల్ లేకుండా తినటంతోనే 'హాలిడే వెయిట్' వచ్చిందని.. అందుకే తనకు అవకాశం మిస్ అయిందని ఓపెన్ గా చెప్పేసింది.  అప్పటి నుంచి తన బరువు విషయంలో జాగ్రత్తగా ఉంటున్నానని తెలిపింది.

అయినా కూడా రాధిక ఓవర్ వెయిట్ ఎప్పుడూ లేదు కదా.. స్లిమ్ గా ఉంది కదా మరి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు?  ఈ విషయంపై స్పందిస్తూ ఆ సినిమా హీరో ఆయుష్మాన్ ఖురానా "అప్పట్లో నేను చాలా బక్కగా ఉండేవాడిని.. నాపక్కన హీరోయిన్ స్లిమ్ గా ఉండకపోతే జోడీ సారిగా ఉండదనే ఉద్దేశంతో రాధికను నిర్మాతలు రిజెక్ట్ చేసినట్టుగా చెప్పుకొచ్చాడు ఆయుష్మాన్.   నిజమే.. ఎవరి వ్యూ పాయింట్ లో వారు కరెక్ట్.  నిర్మాతలు.. దర్శకులు ఏం చెయ్యాలో.. ఎవరిని తీసుకోవాలో బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్ లాగా మనమే చెప్పేయడం సులువు కానీ మనం ఫిలిం మేకర్స్ కాదు కదా?