ఫోటో స్టోరీ: ఆ గ్లామర్ రేంజే వేరప్పా!

Tue May 26 2020 16:17:24 GMT+0530 (IST)

Radhika Apte Glamourous Pose

హీరోయిన్లందు రాధిక ఆప్టే వేరయ్యా ఎందుకంటే ఆమె మహారాష్ట్ర భామ... మహా ఘాటురా మామా అని ఏదో రైమింగ్ పదాలతో ఓ ఇంట్రో ఇస్తే కానీ ఆప్టే రేంజ్ కి అందంగా ఉండదు. నిజానికి అందంగా.. ఘాటుగా ఉండడం అప్డే హాబీ.  అందుకే ఆప్టే పేరు తెలియని నెటిజన్ అసలు నెటిజెనే కాదు. ఆవిడ గారి వైరల్ క్లిప్పుల గురించి తెలియని జీవితం వెధవ జీవితం.  అలాంటి జీవితం ఉంటే ఎంత.. పోతే ఎంత!ఈ విషయాలన్నీ అప్టేకి తెలియదు అనుకోవడం మన భ్రమ.  అందుకే ఆమె రేంజ్ కి తగ్గట్టుగా ఆమె ఫోటో షూట్లు చేస్తూ ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రతలను వీలైనంత పెంచుతూనే ఉంటుంది. అందుకే ఆమె ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. పైన ఉన్న ఫోటో కూడా అలాంటిదే.  ఈ ఫోటో రెగ్యులర్ సంప్రదాయ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవచ్చు.. ఎందుకంటే అల్ట్రా మోడరన్ గా ఉంది.. ఓ ఇంటర్నేషనల్ మోడల్ లాగా కనిపిస్తోంది. ఇక ఆప్టే గారి ఎక్స్ ప్రెషన్ ఎప్పటిలాగే కిరాకు. డ్రెస్ ను క్యారీ చేసే విధానం.. వీ నెక్ అసలు లేదు అన్నట్టుగా ఇచ్చిన క్యాజువల్ భంగిమ అదరహో అని చెప్పాలి.

లోకల్ భామలుగా కనిపించడం పెద్ద గొప్పేమీ కాదు.. ఎందుకంటే దానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. కానీ అంతర్జాతీయ స్థాయి మోడల్ లాగా కనిపించడం చాలా కష్టం..  డ్రెస్ సెన్స్ తో పాటుగా బాడీ లాంగ్వేజ్.. కెమెరా ను ఫేస్ చేసే విధానం ఇలా చాలా అంశాలు ఇమిడి ఉంటాయి. ఆ స్థాయి ఉంది కాబట్టే ఆప్టే ఇన్స్టా ఫోటోలకు లైకులు ఎక్కువ... కామెంట్లు ఎక్కువ. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు.  చివరిగా పోయిన ఏడాది 'ది ఆశ్రమ్'.. 'లిబర్టీ: ఎ కాల్ టు స్పై' అనే ఇంగ్లీష్ సినిమాల్లో నటించింది.