దోసిళ్లలో బీర్.. సిత్రంగా ఒంపిన ఆప్టే!

Tue Nov 29 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Radhika Apte Drinking beer

అందాల నటి రాధికా ఆప్టే ప్రయోగాల గురించి చెప్పనవసరం లేదు. నటిగానే కాదు రియల్ లైఫ్ లోను ఎన్నో ప్రయోగాలు చేయడం ఈ భామకే చెల్లింది. తాజాగా ఈ బ్యూటీ బీర్ టవర్ ముందు చేతులు చాచి కనిపించింది. టవర్ నుంచి బీర్ దోసిలిలో పడితే దానిని గొంతులో ఒంపబోతోందన్నమాట. ఆ ఫోజ్ చూడగానే అభిమానుల కామెంట్లు హద్దు మీరాయి. ఒక అభిమాని తన ఫోజ్ ని చూపిస్తూ.. హేరా ఫేరి చిత్రంలోని ఐకానిక్ పరేష్ రావల్ బాబు రావు పాత్రతో పోల్చారు.`మూడ్` అనే పేరుతో ఈ ఫోటోని ఆప్టే షేర్ చేసారు. ఇందులో ఆప్టే బీర్ టవర్ ముందు చేతులు చాచి కనిపించింది. #goallout అనే హ్యాష్ ట్యాగ్ తో రాధిక ఈ ఫోటోని షేర్ చేసింది. ఇలా బీర్ దోసిలి పట్టే సమయంలో కళ్లను పెద్దవిగా మార్చి చూస్తూ పిక్చర్ లో `మూడ్` గురించి ప్రస్థావించింది. ఆప్టే పోస్ట్ కి చాలా ప్రతిస్పందనలు వ్యక్తమయ్యాయి. ఒక వ్యక్తి ``యే బాబూరావ్ కా స్టైల్ హై`` అని వ్యాఖ్యానించాడు. హేరా ఫేరీ నుండి పరేష్ రావల్ విలక్షణమైన పాత్ర బాబు రావ్ ని గుర్తు చేసాడు. ఇంకొకరు ``ఏ పాగల్ హై క్యా!`` అని వ్యాఖ్యానించాడు. ``మీరు కోవిడ్ తర్వాత పార్టీకి వెళ్లి శానిటైజర్ కోసం వెతుకుతున్నారు..  బాగుంది`` అని టీజ్ చేస్తూ మరో యువకుడు వ్యాఖ్యను జోడించగా.. నాల్గవ వ్యక్తి నవ్వు ఎమోజితో పాటు ``రాధిక తాగడానికి ఇది చాలా ఎక్కువ`` అని సరదాగా వ్యాఖ్యానించాడు.

ఇటీవల విక్రమ వేద లాంటి బ్లాక్ బస్టర్ లో నటించిన రాధిక పేరు మరోసారి ముంబై పరిశ్రమలో మార్మోగింది. అయితే ఈ బ్యూటీ తాజా ఇంటర్వ్యూలో తన గతం గురించి గుర్తు చేసుకుంది. నాడు చిన్న స్థాయి నటులకు నా పాత్రలను చాలా కోల్పోయాను. కానీ నేను ఎప్పుడూ ఉచ్చులో పడలేదు! అని కూడా ఆప్టే వెల్లడించింది.

ముంబై మీడియా హౌస్ తో ఒక ఇంటరాక్షన్ లో తన నిర్మాతల మాటలను గుర్తు చేసుకుంది. తనతో వేరొక నటి గురించి ప్రస్థావిస్తూ ఆమె మరింత అందంగా ఉందని లేదా ఆరాంగా అందాలను ఆరబోస్తోందని కూడా వ్యాఖ్యానించేవారని ఆప్టే తెలిపింది. అలాంటి కారణాలతో రాధికను మేకర్స్ తిరస్కరించేవారట.

``దీనిలో నిజం ఉంది.. బయటకు చెబితే ఇలాంటివి సంచలనాత్మకంగా మారుతాయ``ని రాధిక అంది. అంతేకాదు.. ఇక్కడ వయస్సు ఒక కీలక అంశం. ప్రజలు పెద్ద కమర్షియల్ చిత్రాలలో యువ నటీమణులను కోరుకుంటున్నారనే వాస్తవాన్ని తిరస్కరించలేం. ఇది చాలా నిజం. వారు కోరుకునేది మనం ఇవ్వాల్సి ఉంది`` అని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలైన ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్న ఇమేజ్ సమస్య గురించి ఆప్టే మాట్లాడింది. దీంతో చాలా పోరాడుతున్న వారిలో నటీమణులు ఇతర రంగాల మహిళలు ఉన్నారని తెలిపింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.