రాధేశ్యామ్ అండర్ వాటర్ సీన్ విజువల్ వండర్

Sat Dec 05 2020 10:27:54 GMT+0530 (IST)

Radheshyam Underwater Scene Visual Wonder

ప్రభాస్.. రాధాకృష్ణ కాంబోలో రూపొందోతున్న 'రాధేశ్యామ్' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు ముగుస్తుందా అంటూ అభిమానులు మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సుదీర్ఘ కాలంగా జరుగుతున్న రాధేశ్యామ్ షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా కోసం అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నట్లుగా దర్శకుడు రాధాకృష్ణ ఇటీవలే పేర్కొన్నాడు. క్వాలిటీ విషయంలో మునుపెన్నడు ఉపయోగించని కెమెరాలను వాడుతున్నామని చెప్పాడు. ఇక ఈ సినిమాలోని ఒక అండర్ వాటర్ ఎపిసోడ్ కోసం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసిన కెమెరా మరియు లెంగ్స్ ను ఉపయోగించబోతున్నారట.నీటిలో సాగే ఆ ఎపిసోడ్ విజువల్ వండర్ గా అద్బుతం అనిపించేలా చిత్రీకరిస్తున్నట్లుగా మేకర్స్ అనధికారికంగా చెబుతున్నారు. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కొమొడో కెమెరా.. లజౌవా అల్ట్రావైడ్ లెన్స్ ను ఉపయోగించి వాటర్ లో చిత్రీకరించబోతున్నారట. సీన్స్ వెండి తెరపై చూస్తున్న సమయంలో ప్రేక్షకులు సర్ ప్రైజ్ అవ్వడంతో పాటు థ్రిల్ అవుతారు అంటూ మేకర్స్ అంటున్నారు. ఈ సినిమాలోని ప్రతి సీన్ కూడా అత్యంత అందంగా స్టైలిష్ గా చిత్రీకరించేందుకు దర్శకుడు తీవ్రంగా ప్రయత్నించాడు. అందుకే ఇంత సమయం అయ్యింది. అలాంటిది అండర్ వాటర్ ను మరింత ఎక్కువ జాగ్రతలు తీసుకుని తీస్తున్న కారణంగా ఆ సీన్ ఖచ్చితంగా విజువల్ వండర్ గా ఉంటుందనిపిస్తుంది.