ఈ దెబ్బతో 'రాధే శ్యామ్' ని ముగించేసినట్లే..!

Tue Jul 20 2021 15:00:16 GMT+0530 (IST)

Radhe shyam Shooting will Complete by this schedule

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటిస్తున్న వింటేజ్ లవ్ డ్రామా ''రాధే శ్యామ్''. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 1960ల నాటి ఇటలీ నేపథ్యంలో నడిచే ఈ కథలో విక్రమాదిత్య గా ప్రభాస్.. ప్రేరణ గా పూజా కనిపించనున్నారు. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే జూలై 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వచ్చి విడుదల వాయిదా పడేలా చేసింది. అయితే ఇప్పటికే మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చివరి దశకు వచ్చేసింది.ప్రభాస్ - పూజా హెగ్డే లు జూలై 22 నుంచి 'రాధేశ్యామ్' సెట్స్ లో జాయిన్ అవ్వబోతున్నట్లు సమాచారం. ఇద్దరు పాల్గొనే సన్నివేశాలతో ప్యాచ్ వర్క్ పూర్తి అవుతుందట. ఇప్పటికే లేట్ అవుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్ ని ఈ దెబ్బతో ముగించాలని చిత్ర బృందం ప్లాన్ రెడీ చేసింది. అలానే సరైన టైమ్ చూసి విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని ఏరియాల్లో థియేటర్స్ పరిస్థితులు చూసి విడుదల చేయాలి కాబట్టి మేకర్స్ అన్నీ విధాలుగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

'రాధే శ్యామ్' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ - టీ సిరీస్ - గోపీకృష్ణా మూవీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. వంశీ - ప్రమోద్ - భూషణ్ కుమార్ - ప్రశీద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మనోజ్ పరమహంస ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తుండగా.. హిందీ వెర్షన్ కు మిథున్ - మనన్ భరద్వాజ్ కలసి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. భాగ్యశ్రీ - జగపతిబాబు - సత్యరాజ్ - కునాల్ రాయ్ కపూర్ - సచిన్ ఖేడ్కర్ - మురళి శర్మ - శాషా ఛత్రి - ప్రియదర్శి - రిద్దికుమార్ - సత్యన్ వంటి స్టార్ క్యాస్టింగ్ ఈ సినిమాలో ఉంది.

ఇదిలా ఉండగా ప్రభాస్ 'రాధే శ్యామ్' చిత్రంతో పాటుగా 'సలార్' 'ఆది పురుష్' సినిమాల షూటింగ్స్ కూడా చేయాల్సి ఉంది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదిపురుష్' ఇప్పటికే తిరిగి స్టార్ట్ అయినట్లు సమాచారం. ప్రభాస్ లేని సన్నివేశాలను గ్రీన్ మ్యాట్ మీద తీస్తున్నారట. 'రాధే శ్యామ్' కంప్లీట్ చేసి ఓం రౌత్ టీమ్ లో ప్రభాస్ జాయిన్ అవుతాడు. 2022 ఆగస్టులో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్.. సీత పాత్రలో బాలీవుడ్ భామ కృతి సనన్ నటిస్తున్నారు. రావణుడిగా సైఫ్ అలీఖాన్ - లక్ష్మణుడిగా యువ హీరో సన్నీ సింగ్ కనిపించనున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం సాచెత్ తాండన్ - పరంపరా ఠాకూర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. టీ-సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్ పై భూషణ్ కుమార్ - కృష్ణ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'సలార్' చిత్రాన్ని 2022 ఏప్రిల్ 23న రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రుర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ మోస్ట్ వైలెంట్ లుక్ లో కనిపించనున్నాడు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.