రాధేశ్యామ్ ట్రైలర్ అన్ని లెక్కల్ని సరిచేస్తుందా?

Wed Dec 08 2021 13:02:10 GMT+0530 (IST)

Radhe shyam Campaign will be further speeded

ప్రభాస్-పూజాహెగ్డే జంటగా నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` సంక్రాంతి కానుకగా జనవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కి ఇంకా సరిగ్గా నెల రోజులే సమయం ఉండటంతో యూనిట్ ప్రచారం షురూ చేసింది. ఇప్పటికే చిత్రబృందం ఈ సినిమాకి బజ్ తీసుకురావడంలో వెనుకబడిందన్న గుసగుస ఉంది.ఓవైపు జక్కన్న `ఆర్.ఆర్.ఆర్` ని పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. ట్రైలర్ ని మెట్రోపాలిటన్ సిటీస్ లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో `రాధేశ్యామ్` యూనిట్ కూడా పెద్ద ఎత్తునే ప్రచార కార్యక్రమాలు చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈనెల 17న `రాధేశ్యామ్` ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి ముహుర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఒకవేళ ఆ తేదీకి ట్రైలర్ రెడీ కాకపోతే అదే నెల 21న రిలీజ్ చేయాలని ప్రత్యామ్నాయ తేదీగా పెట్టుకున్నట్లు తెలిసింది. ట్రైలర్ రిలీజ్ అనంతరం ప్రచారం మరింత స్పీడప్ చేయనున్నారు.

అప్పట్లో `బాహుబలి` పబ్లిసిటీ స్టంట్ అధునాతన స్ట్రాటజీ వెనుక రాజమౌళి ఉన్నారు. కాబట్టి అన్ని పనుల్ని ఆయనే దగ్గరుండి చూసుకు న్నారు. ఇప్పుడు ఆ బాధ్యతల్నింటినీ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చూసుకోవాలి. ప్రభాస్ గత పాన్ ఇండియా చిత్రం `సాహో` వైఫల్యం నేపథ్యంలో `రాధేశ్యామ్` ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత యంగ్ మేకర్ పై ఉంది.

అయితే ఇప్పటికే ఇంగ్లీష్ భాషలో ప్రభాస్ ఇంట్రోకి సంబంధించి సాంపిల్ టీజర్ వదిలారు. కానీ అది జనాలకు అంతగా ఎక్కలేదు. పైపెచ్చు విమర్శల్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది.

ఆ టీజర్ సినిమాకి ఎంత మాత్రం బజ్ తీసుకురాలేదు. అప్పటివరకూ సినిమాపై ఉన్న ఇంప్రెషన్ పై కూడా ఇంపాక్ట్ పడింది. మరి ఈ లెక్కలన్నింటిని ట్రైలర్ సరి చేయాల్సి ఉంది. ఇది రొమాంటిక్ పీరియాడిక్ లవ్ స్టోరీ గా ఇప్పటికే ప్రేక్షకుల్లోకి వెళ్లింది. ఆ అంచనాల్ని నిలబెట్టాల్సిన బాధ్యత దర్శకుడిపై ఉంది. ఈ చిత్రాన్ని యూవీక్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. టీసిరీస్ హిందీలో రిలీజ్ చేస్తోంది.