'రాధే శ్యామ్' ఆన్ లొకేషన్ స్టిల్స్.. రాధాకృష్ణ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లున్నాడే..!

Tue Jun 15 2021 20:00:01 GMT+0530 (IST)

Radhe Shyam on location stills

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''రాధే శ్యామ్''. రాధా కృష్ణ కుమార్ అందమైన ప్రేమకావ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది జ్యోతిష్యానికి సైన్స్ కు మధ్య సాగే రొమాంటిక్ పీరియాడికల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. విక్రమాదిత్య గా ప్రభాస్.. ప్రేరణ గా పూజా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు మోషన్ టీజర్ ఈ విషయాన్ని స్పష్టం చేసేలా ఉన్నాయి.భారీ సెట్స్ - హై టెక్నికల్ వాల్యూస్ తో 1960ల నాటి ఇటలీ బ్యాక్ డ్రాప్ లో వింటేజ్ డ్రామాగా 'రాధే శ్యామ్' చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. తాజాగా ఈ సినిమాలోని కొన్ని ఆన్ లొకేషన్ స్టిల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒకటి వర్షంలో షూట్ చేస్తున్న సాంగ్ కు సంబంధించినదని తెలుస్తోంది. మరొక ఫొటోలో లొకేషన్ చూస్తుంటే రాధాకృష్ణ కుమార్ గ్రాండియర్ గా 'రాధే శ్యామ్' ను చూపించబోతున్నారని అర్థం అవుతోంది.

'రాధే శ్యామ్' చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. వంశీ - ప్రమోద్ - ప్రశీద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు - సత్యరాజ్ - భాగ్యశ్రీ - కునాల్ రాయ్ కపూర్ - సచిన్ ఖేడ్కర్ - మురళి శర్మ - శాషా ఛత్రి - ప్రియదర్శి - రిద్దికుమార్ - సత్యాన్ తదితరులు నటిస్తున్నారు.

ఈ సినిమా హిందీ వెర్షన్ కు మిథున్ - మనన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తుండగా.. దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 'రాధే శ్యామ్'.. 10 రోజుల చిత్రీకరణతో పెండింగ్ వర్క్ పూర్తవుతుందని తెలుస్తోంది. 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమా తర్వాత అన్నీ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్లలో నటిస్తున్న డార్లింగ్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.