Begin typing your search above and press return to search.

డార్లింగ్ ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకున్న 'రాధే శ్యామ్' మ్యూజిక్ డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   20 Jun 2021 3:30 AM GMT
డార్లింగ్ ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకున్న రాధే శ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్..!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరీ ''రాధే శ్యామ్''. 1960ల నాటి బ్యాక్ డ్రాప్ లో రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ - గోపీకృష్ణ మూవీస్‌ - టీ సిరీస్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని రూపొందిస్తున్నాయి. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకి సంబంధించిన ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. అయితే అప్పుడెప్పుడో ఫస్ట్ లుక్ - గ్లిమ్స్ రిలీజ్ చేసిన మేకర్స్.. మరో అప్డేట్ ఇవ్వకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో 'రాధే శ్యామ్' మ్యూజిక్ డైరెక్టర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ కీలక అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు.

'రాధే శ్యామ్' తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్ కు మాత్రం మిథున్ - మనన్ భరద్వాజ్ కలసి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. మిథూన్ రెండు పాటలు.. మనన్ ఒక పాట కంపోజ్ చేసారని తెలుస్తోంది. అయితే తాజాగా మనన్ భరద్వాజ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా త్వరలోనే బిగ్ అప్డేట్ రానున్నట్లు వెల్లడించారు. "కలలు నిజమవుతాయి. కొన్నిసార్లు మిమ్మల్ని ఉద్వేగానికి గురిచేస్తాయి. నా డ్రీమ్ నిజమైనందుకు మళ్ళీ ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను. 'రాధే శ్యామ్' అప్డేట్ త్వరలో రాబోతోంది. మీరు నాకన్నా ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారా? బిగ్ డే కోసం వేచి ఉండండి. మీ అందరికీ ఎమోషన్ అనుభూతిని వినిపించడానికి వెయిట్ చేయలేకపోతున్నాను. #త్వరలో'' అని పోస్ట్ చేసిన మనన్.. 'రాధే శ్యామ్' పోస్టర్స్ షేర్ చేశారు. డార్లింగ్ అభిమానులని సంతోష పెట్టే ఆ అప్డేట్ ఏంటో.. ఆ బిగ్ డే ఎప్పుడో త్వరలోనే అనౌన్స్ చేస్తారేమో చూడాలి.