శివరాత్రికి మెలోడియస్ మ్యూజిక్ తో మెస్మరైజ్ చేయనున్న 'రాధే శ్యామ్'?

Tue Feb 23 2021 11:00:01 GMT+0530 (IST)

Radhe Shyam Shivaratri Update

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ''రాధే శ్యామ్''. 1970 దశకం నాటి వింటేజ్ ప్రేమకథగా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో జులై 30న గ్రాండ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఇదే క్రమంలో ఇప్పుడు శివరాత్రి పండుగను పురస్కరించుకుని ఫ్యాన్స్ కి మరో సర్ప్రైజ్ ఇవ్వడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోందని సమాచారం.'రాధే శ్యామ్' గ్లిమ్స్ కి మిశ్రమ స్పందన రావడంతో దాన్ని నుంచి బయటకు తీసుకురావడానికి ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. శివరాత్రి సందర్భంగా మార్చి 11న మెలోడియస్ మ్యూజిక్ తో డార్లింగ్ టీమ్ మెస్మరైజ్ చేయబోతున్నారట. ఇకపోతే 'రాధే శ్యామ్' హిందీ వెర్షన్ కు మిథున్ - మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగుతోపాటు మిగిలిన దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. టీ-సిరీస్ గుల్షన్ కుమార్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ బ్యానర్స్ పై భూషణ్ కుమార్ - వంశీ - ప్రమోద్ - ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.