Begin typing your search above and press return to search.

రాధేశ్యామ్ రిలీజ్ తేదీని ప్ర‌క‌టించిన డార్లింగ్ ప్ర‌భాస్

By:  Tupaki Desk   |   30 July 2021 4:10 AM GMT
రాధేశ్యామ్ రిలీజ్ తేదీని ప్ర‌క‌టించిన డార్లింగ్ ప్ర‌భాస్
X
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్- పూజాహెగ్గే జంట‌గా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `రాధేశ్యామ్` పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. యూవీ క్రియేష‌న్స్ భారీ బ‌డ్జెట్ తో ఎక్క‌డా రాజీ లేకుండా నిర్మిస్తోంది. 1980ల‌లో యూర‌ప్ నేప‌థ్యంలో సాగే రొమాంటిక్ ల‌వ్ స్టోరి మెస్మ‌రైజ్ చేయ‌నుంది. ఆ కాలం నాటి సెట్లు నిర్మించి యాక్ష‌న్ స‌న్నివేశాల్ని అంతే హైలైట్ గా తీర్చిదిద్దారు. ఇది టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలోని మూవీ అని ..ప్ర‌తీ స‌న్నివేశం ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ట్విస్టుల‌తో ఎంతో అద్బుతంగా ఉంటుంద‌ని స‌మాచారం.

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీగా రికార్డుల‌కెక్కిన రాధేశ్యామ్ రాక కోసం ప్ర‌భాస్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. క‌రోనా క్రైసిస్ వ‌ల్ల ఈ సినిమా రిలీజ్ అంత‌కంత‌కు ఆల‌స్య‌మైంది. 2021 సంక్రాంతి .. స‌మ్మ‌ర్ రిలీజ్ అంటూ ప్ర‌చారం సాగినా అది వీలుప‌డ‌లేదు. ఎట్ట‌కేల‌కు పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియాలో ఈ చిత్రం రిలీజ్ తేదీతో పోస్టర్ ను పంచుకున్నారు. ఇందులో డార్లింగ్ యూరోప్ వీధుల్లో నడుస్తూ కనిపిస్తున్నారు. ఈ చిత్రం మకర సంక్రాంతి (పొంగల్) సందర్భంగా విడుదలవుతుంద‌ని పోస్టర్ చెబుతోంది. 2022 జనవరి 14న రాధేశ్యామ్ రిలీజ్ కానుంది.

``నా రొమాంటిక్ సాగా #రాధేశ్యామ్ కోసం మీరంతా కొత్త విడుదల తేదీ కోసం వేచి చూస్తున్నారు. మీరు వేచి ఉండలేరు - ఇది 14 జనవరి 2022న‌ ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది`` అని ప్ర‌భాస్ వ్యాఖ్య‌ను జోడించారు. ఎట్ట‌కేల‌కు రిలీజ్ తేదీ ప్ర‌క‌ట‌న ప్ర‌భాస్ అభిమానుల్లో ఎగ్జ‌యిట్ మెంట్ పెంచింది. అయితే ఈ ఏడాదిలో రిలీజ్ లేక‌పోవ‌డం కొంద‌రిని తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ఈ చిత్రం 2022లో అతిపెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వాల‌ని ప్ర‌భాస్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ప్రభాస్ దాదాపు ఒక దశాబ్దం తర్వాత ఒక రొమాంటిక్ ల‌వ్ స్టోరీలో న‌టిస్తుండం కూడా ఎగ్జ‌యిట్ మెంట్ ని పెంచింది. ఈ చిత్రంలో ప్రభాస్ - పూజా హెగ్డే జంట ఎంతో బ్యూటిఫుల్ గా క‌నిపిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన పోస్ట‌ర్ల‌లో ప్రభాస్ ఒక లవర్ బాయ్ పాత్రలో ఎంతో స్మార్ట్ గా క‌నిపించారు. ఈ బ‌హుభాషా చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్ సమర్పణలో యువి క్రియేషన్స్ నిర్మించింది. బాలీవుడ్ లో టీసిరీస్ రిలీజ్ చేయ‌నుంది.