Begin typing your search above and press return to search.

'నేను వెయ్యి సార్లు విన్నాను'.. 'రాధేశ్యామ్' పాటపై దర్శకుడి మాట..!

By:  Tupaki Desk   |   29 Nov 2021 3:43 PM GMT
నేను వెయ్యి సార్లు విన్నాను.. రాధేశ్యామ్ పాటపై దర్శకుడి మాట..!
X
'డార్లింగ్' 'మిస్టర్ పర్ఫెక్ట్' తర్వాత చాలా గ్యాప్ తీసుకొని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రేమకథా చిత్రం ''రాధేశ్యామ్''. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఇటలీ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో విక్రమాదిత్య అనే పామిస్ట్ గా ప్రభాస్.. ప్రేరణగా పూజాహెగ్డే కనిపించనున్నారు. సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరు పెంచిన మేకర్స్.. ''నగుమోము తారలే'' అనే పాటను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.

'రాధే శ్యామ్' నుంచి ఇప్పటికే విడుదలైన 'ఈ రాతలే' పాటకి చక్కటి ఆదరణ లభించింది. ఈ క్రమంలో 'ఒకే గుండె.. రెండు చప్పుళ్లు' అనే కాన్సెప్ట్ తో లిరిక్స్ లేకుండా కేవలం మ్యూజిక్ తోనే వదిలిన సెకండ్ సింగిల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మెలోడీ గీతానికి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూర్చారు. తెలుగు వెర్షన్ కు కృష్ణ కాంత్ సాహిత్యం అందించగా.. మ్యూజిక్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఆలపించారు.

'నగుమోము తారలే' సాంగ్ టీజర్ లో ప్రభాస్ - పూజా హెగ్డేల మధ్య స్వచ్ఛమైన ప్రేమ గాఢతను తెలియజేసే ప్రయత్నం చేశారు. పూజా ట్రైన్ దిగి వస్తుండగా.. ప్రభాస్ బైక్ పై కూర్చొని వర్షంలో తడుస్తూ ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు. అలానే సముద్ర తీరాన డార్లింగ్ స్టైల్ గా నడుచుకుంటూ రావడాన్ని చూపిస్తూ.. ప్రభాస్-పుజా మధ్య రొమాన్స్ ని అందంగా ఆవిష్కరించారు. ఇందులో హీరోహీరోయిన్ల వింటేజ్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.

మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ - కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ - ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ పనితనం 'రాధే శ్యామ్' సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు సాంగ్ టీజర్ చూస్తే అర్థం అవుతోంది. జస్టిన్ ప్రభాకర్ స్వరాలు.. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ స్పెషల్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ లవ్ ఆంథమ్ ఫుల్ సాంగ్ ని డిసెంబర్ 1వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

'నగుమోము తారలే' పాట గురించి దర్శకుడు రాధాకృష్ణ వెల్లడిస్తూ.. 'వదిలేసిన - మార్చిపోయిన - విడిపోయిన ప్రేమలన్నీ కలిసే టైం వచ్చింది' అని పేర్కొన్నారు. 'నేను వెయ్యి సార్లు విన్న పాట ఇది. ఈ అద్భుత అనుభవానికి జస్టిన్ ప్రభాకర్ కు ధన్యవాదాలు.. సాహిత్యం అందించినందుకు నా మిత్రుడు కృష్ణకాంత్ & దీన్ని వీలైనంత గుర్తుండిపోయేలా చేసినందుకు సిద్ శ్రీరామ్ కు కృతజ్ఞతలు' అని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.

ఇకపోతే 'రాధే శ్యామ్' లోని ఈ మెలోడీ సాంగ్ హిందీ వెర్షన్ కు మిథున్ స్వరాలు సమకూర్చారు. 'ఆషిఖీ ఆగయీ' అంటూ సాగిన ఈ మెలోడీ గీతాన్ని అర్జిత్ సింగ్ - మిథున్ కలిసి అద్భుతంగా ఆలపించారు. ఏదేమైనా ఒకే సినిమాకు రెండు వేర్వేరు ఆల్బమ్స్ కంపోజ్ చేస్తుండటం విశేషమనే చెప్పాలి.

కాగా, 'రాధే శ్యామ్' చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో టీ సిరీస్ - యూవీ క్రియేషన్స్ - గీతాకృష్ణ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. భూషణ్ కుమార్ - వంశీ - ప్రమోద్ - ప్రసీద నిర్మాతలుగా వ్యవహరిసస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషలతో పాటుగా విదేశీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.