'ఆషికి ఆగయీ' ప్రోమో.. 'రాధే శ్యామ్' హిందీ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ..!

Mon Nov 29 2021 14:50:12 GMT+0530 (IST)

Radhe Shyam Hindi Musical Promotions Launch

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ లవ్ డ్రామా ''రాధే శ్యామ్''. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇటీవలే నాలుగు భాషల్లో రిలీజ్ చేసిన 'ఈ రాతలే' పాట ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈ క్రమంలో 'వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్' పేరుతో ‘నగుమోము తారలే’ అనే సెకండ్ సింగిల్ ని విడుదల చేస్తున్నారు.అయితే తాజాగా 'ఏ మేరే ఆషిఖీ ఆగయీ' అంటూ సాగే హిందీ వెర్షన్ సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిన్న టీజర్ లో ప్రభాస్ - పూజాహెగ్డే ల మధ్య గాఢమైన ప్రేమను తెలియజేసే ప్రయత్నం చేశారు. సముద్ర తీరాన అందమైన లొకేషన్స్ లో షూట్ చేసిన ఈ పాట విజువల్ గా కూడా ఆకట్టుకుటుంది. ఇందులో హీరోహీరోయిన్ల లుక్స్ బాగున్నాయి. ఈ లవ్ ఆంథమ్ కు బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ మిథున్ ట్యూన్ సమకూర్చడమే కాకుండా.. లిరిక్స్ రాశారు. అర్జిత్ సింగ్ - మిథున్ కలిసి అద్భుతంగా ఆలపించారు.

'రాధే శ్యామ్' సినిమా తెలుగు తమిళం కన్నడ మలయాళ వెర్సన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే 'ఈ రాతలే' పాట హిందీ వెర్షన్ ను రిలీజ్ చేయని మేకర్స్.. ఇప్పుడు 'వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్' సాంగ్ తో హిందీ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేశారు. ‘నగుమోము తారలే’ పాట తెలుగు పాటతో పాటుగా మిగిలిన మూడు దక్షిణాది వెర్సన్స్ ఈరోజు సోమవారం రాత్రి 7 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

కాగా 'రాధే శ్యామ్' చిత్రాన్ని భూషణ్ కుమార్ సమర్పణలో టీ సిరీస్ - యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యత నిర్వహిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.