Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదుగా

By:  Tupaki Desk   |   26 Jan 2022 3:33 PM GMT
ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదుగా
X
భారీ చిత్రాల‌కు కోవిడ్ పెద్ద విల‌న్ గా మారింది. దీని కార‌ణంగా బిగ్ టిక్కెట్ మూవీస్ రిలీజ్ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. థియేట‌ర్ల‌లో సినిమా రిలీజ్ కావాలంటే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మార్పులు రావాలి. అలా మార్పులు మొద‌లైతే కానీ భారీ చిత్రాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌లేని ప‌రిస్థితి. దీంతో బిగ్ టిక్కెట్ సినిమాల‌పై రోజుకో వార్త నెట్టింట హ‌ల్ చ‌ల్ చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. దీనికి అభిమానులు కూడా తోడ‌వ్వ‌డంతో నెట్టింట రోజుకో రచ్చ జ‌రుగుతోంది.

ఇదే ప‌రిస్థితి ఇప్పుడు ప్ర‌భాప్ న‌టించిన `రాధేశ్యామ్` కు కూడా ఎదుర‌వుతోంది. గ‌త కొంత కాలంగా ఈ మూవీ అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఆల‌స్య‌మైతే ఎదురుదాడికి దిగి షాకిస్తున్న ప్ర‌భాస్ అభిమానులు తాజాగా ఈ మూవీ రిలీజ్ పై కూడా మేక‌ర్స్ ని నిల‌దీయ‌డం ఇప్పుడు చర్చ‌నీయాంశంగా మారింది. వీరికి తోడు బాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖ క్రిటిక్ రోహిత్ జైస్వాల్ `రాధేశ్యామ్‌` ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనే రిలీజ్ అవుతుంద‌ని కామెంట్ చేశాడు. అంతే కాకుండా ఈ చిత్రానికి ఓ ప్ర‌ముఖ ఓటీటీ 500 కోట్ల‌కు ఆఫ‌ర్ ఇచ్చింద‌ని ట్వీట్ చేశాడు.

దీంతో ఆగ్ర‌హించిన ప్ర‌భాస్ అభిమానులు అత‌న్ని ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. అంతే కాకుండా అలా ఆఫ‌ర్ చేసిన ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏదో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌భాస్ అభిమానుల‌తో పాటు చాలా మంది తెలుగు వాళ్లు రోహిత్ జైస్వాల్ ని ఈ విష‌యంపై నిల‌దీశారు. కానీ అత‌ను ఏ ఓటీటీ దిగ్గ‌జం `రాధేశ్యామ్‌` కు ఆఫ‌ర్ ఇచ్చింద‌న్న‌ది మాత్రం చెప్ప‌లేదు. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ తో పాటు అన్ని ర‌కాల షాటిలైట్ హ‌క్కుల్ని జీ స్టూడియోస్ 500 కోట్ల‌కు సొంతం చేసుకుందని గ‌తంలో ప్ర‌చారం జ‌రిగింది.

ఆ ప్ర‌చారాన్ని నిజం చేస్తూ రోహిత్ జైస్వాల్ ట్వీట్ చేయ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ లో ఆందోళ‌న మొద‌లైంద‌ని, ఇదే విష‌యంపై స్పందించ‌మ‌ని మేక‌ర్స్ తో పాటు ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ని సోష‌ల్ మీడియా వేదిక‌గా నిల‌దీశారు. అభిమానులు ఎదురుదాడి తీవ్రం కావ‌డంతో ద‌ర్శ‌కుడు స్పందించారు. `త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో క‌లుద్దాం` అంటూ `రాధేశ్యామ్` ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు.

ఉద‌యం నుంచి సోష‌ల్ మీడియా వేదిక‌గా మొద‌లైన `రాధేశ్యామ్‌` ఓటీటీ రిలీజ్ ర‌చ్చ సాయంత్రానికి గానీ త‌గ్గ‌లేదు. ఉద‌యం నుంచే ఈ వార్త వైర‌ల్ కావ‌డంతో మేక‌ర్స్ ఈ మూవీ థియేట‌ర్ల‌లోనే విడుద‌ల‌వుతుంద‌ని నిర్మాత‌లు ఓ న్యూస్ ని పాస్ చేశారు. చివ‌రికి ద‌ర్శ‌కుడు ట్విట్ట‌ర్ వేదిక‌గా క్లారిటీ ఇవ్వ‌డంతోప్ర‌భాస్ ఫ్యాన్స్ శాంతించారు. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన షాకింగ్ విష‌యం ఒక‌టి తాజాగా బ‌య‌టికి వ‌చ్చింది. ఈ మూవీ అన్ని భాష‌ల‌కు సంబంధించిన శాటిలైట్ హ‌క్కుల్ని జీ స్టూడియోస్ సొంతం చేసుకుంద‌ని తెలిసింది. అయితే ఓటీటీ రిలీజ్ కి సంబంధించిన డీల్ మాత్రం ఇంకా కుద‌ర‌లేద‌ని చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.