సినిమా ప్లాప్ కాని వసూళ్లు సూపర్

Sat May 15 2021 11:00:01 GMT+0530 (IST)

Radhe 1st Day Box Office Collections

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా చూపించేందుకు రాధే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాధే సినిమా రంజాన్ సందర్బంగా విడుదల అయ్యింది. అయితే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా ఉన్న నేపథ్యంలో థియేటర్లకు జనాలు వస్తారా లేదా అనే అనుమానంతో ఓటీటీ ద్వారా కూడా ఈ సినిమా ను విడుదల చేశారు. అయితే పే పర్ వ్యూ ద్వారా ఈ సినిమా ను స్ట్రీమింగ్ చేస్తున్నారు. మొదటి రోజు ఈ సినిమా ను జీ5 మరియు జీ వారికి సంబంధించిన ఇతర యాప్స్ ద్వారా ఏకంగా 4.2 మిలియన్ ల మంది చూశారట.'రాధే' సినిమా మొదటి రోజు ఏకంగా 100 కోట్ల కు పైగా వసూళ్లు సాధించినట్లుగా తెలుస్తోంది. సినిమాను మొదటి రోజు ఓటీటీ లో అది కూడా పే పర్ వ్యూ ద్వారా ఎక్కువ మంది చూస్తారా అంటూ చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. కాని సల్మాన్ ఖాన్ క్రేజ్ ఎలాంటిదో దీంతో తేలిపోయింది. స్టార్ హీరోలు ముందు ముందు ఇలా ఓటీటీ ద్వారా పే పర్ వ్యూ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రాధే సినిమా మార్గం చూపినట్లయ్యిందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా మొదటి రోజు భారీ వసూళ్లను అయితే దక్కించుకుంది కాని సినిమా కు మాత్రం ప్లాప్ టాక్ వచ్చింది. సినిమా కు వచ్చిన ప్లాప్ టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు వసూళ్లు నమోదు అయ్యాయి. అయితే ముందు ముందు వసూళ్లు ఎలా ఉంటాయి అనేది మాత్రం చెప్పలేని పరిస్థితి. రాధే సినిమా కు ప్రభుదేవా దర్శకత్వం వహించాడు. దిశా పటాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో అల్లు అర్జున్ సిటీమార్ పాటను రీమిక్స్ చేశారు. దాంతో తెలుగు ఆడియన్స్ లో కూడా ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది. కాని ఈ సినిమా ఫక్త్ రెగ్యులర్ కమర్షియల్ మూవీగా ఉందని.. కొత్తదనంతో పాటు ఆకట్టుకునే అంశాలు పెద్దగా లేవంటూ రివ్యూలు వచ్చాయి.