Begin typing your search above and press return to search.

50 వ‌య‌సులో రేసింగులు రైఫిల్ షూటింగులు.. ఆ హీరో పిచ్చేంటి?

By:  Tupaki Desk   |   7 March 2021 3:30 AM GMT
50 వ‌య‌సులో రేసింగులు రైఫిల్ షూటింగులు.. ఆ హీరో పిచ్చేంటి?
X
అత‌డి వ‌య‌సు 50 సుమారు. అయినా అత‌డిలో చేవ త‌గ్గిన‌ట్టులేదు. ఇప్ప‌టికీ అత‌డు మోటార్ రేసింగుల్లో చ‌లాకీగా ఉన్నాడు. అంతేకాదు.. ఎయిర్ రైఫిల్ షూట‌ర్ గానూ స‌త్తా చాటుతున్నాడు. అది కూడా ఆషామాషీ పోటీల్లో కాదు. నేరుగా చాంపియ‌న్లు బ‌రిలో దిగే చోట వారితో పోటీప‌డుతూ దుమ్ము దులిపేస్తున్నాడు.

షూటింగుల్లేన‌ప్పుడ‌ల్లా త‌న ఆస‌క్తి అభిరుచికి త‌గ్గ‌ట్టు స్పోర్ట్స్ లోకి దిగిపోతుంటాడు. నిరంత‌రం ప్రాక్టీస్ చేస్తుంటాడు. కాంపిటీష‌న్స్ ఉన్న‌ప్పుడు ఒక సాధార‌ణ ఆట‌గాడిలా నేరుగా బ‌రిలో దిగిపోతుంటాడు. అలా ఇప్ప‌టికే ఇంటినిండా ఎన్నో ప‌థ‌కాలు సాధించి అలంక‌రించాడు.

న‌ట‌న త‌న‌కు వృత్తి అయితే క్రీడ‌లు త‌న ప్ర‌వృత్తి. ఆట‌లు అంటే గొప్ప ఫ్యాష‌న్ మ్యాట‌ర్. అందుకే రెండిటినీ విడిచిపెట్ట‌డు. నిజానికి న‌ట‌న‌లోకి రాని రోజుల్లో అత‌డు స్టేట్ లెవ‌ల్ రేస‌ర్ గా షూట‌ర్ గానూ రాణించాడు. అందుకే ఇప్ప‌టికీ అదే ఫ్యాష‌న్ తో ఉంటాడు. ప్ర‌స్తుతం అత‌డు తమిళనాడు స్టేట్ షూటింగ్ ఛాంపియన్ షిప్ ‌లో దూసుకెళుతున్నాడు. షూట‌ర్ గా పోటీలో పాల్గొంటున్న దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎయిర్ పిస్టల్ విభాగంలో దూసుకెళుతున్న వీడియోలు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి.

అంతిమంగా ప‌థ‌కం గెలిచినా గెల‌వ‌క పోయినా త‌న‌దైన ఆట‌తో అత‌డు అంద‌రి మ‌న‌సుల్ని దోచేస్తున్నాడు. రియ‌ల్ లైఫ్ హీరోగా అత‌డు స‌త్తా చాటుతున్నాడు. ఇంత‌కీ ఎవ‌రా హీరో? అంటే ప్ర‌త్యేకించి చెప్పాలా. ది గ్రేట్ త‌ళా అజిత్. వండ‌ర్ ఫుల్ గ్యాంబ్ల‌ర్.