'రాబ్తా' నా హృదయానికి బాగా దగ్గరైన సినిమా: 'ఆదిపురుష్' హీరోయిన్

Thu Jun 10 2021 17:00:01 GMT+0530 (IST)

'Rabta' movie that is very close to my heart: 'Adipurush' is the heroine

దివంగత యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ - బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ మాజీ ప్రేమికులనే విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి ''రాబ్తా'' అనే చిత్రంలో నటించారు. ఆ సమయంలోనే వీరు ప్రేమించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా విడుదలై బుధవారానికి నాలుగేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సుశాంత్ ను తలచుకొని కృతిసనన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ అయింది. తన మనసుకు బాగా దగ్గరైన సినిమా ఏదైనా ఉందంటే అది 'రాబ్తా' మాత్రమే అని కృతి హార్ట్ టచింగ్ పోస్ట్ పెట్టింది.'రాబ్తా' షూటింగ్ సమయంలో తీసిన ఓ వీడియోని షేర్ చేసిన కృతి సనన్ ఈ విధంగా రాసుకొచ్చింది. ''నేను కనెక్షన్ ను నమ్ముతాను. మనం ఏ వ్యక్తులను కలవాలని రాసిపెట్టి ఉంటే వాళ్ళని కలుస్తామని నేను నమ్ముతాను. సుశాంత్ - డినూ మరియు మాడాక్ ఫిల్మ్ లతో నా 'రాబ్తా' కూడా అలానే ఉద్దేశించబడింది. సినిమాలు వచ్చి పోతుంటాయి. కానీ ప్రతి ఒక్క సినిమా వెనుక చాలా జ్ఞాపకాలు ఉంటాయి. మనం ఏర్పరచుకున్న కనెక్షన్లు & మనం ఒకరితో ఒకరు జీవించే క్షణాలు మనలోనే ఉంటాయి. ఇతరులకన్నా నాకు కొంత ఎక్కువ ఉన్నాయి. 'రాబ్తా' నా బెస్ట్ సినిమా మరియు మరపురాని అనుభవాలలో ఒకటి. ఇది ఎల్లప్పుడూ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది మా మొదటి మరియు చివరిది అని నాకు తెలియదు'' అని ప్పోస్ట్ చేసిన కృతి హార్ట్ బ్రేక్ ఎమోజీని జత చేసింది.

కాగా మహేష్ బాబు '1 నేనొక్కడినే' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది ఢిల్లీ భామ కృతిసనన్. నాగచైతన్యతో కలిసి 'దోచెయ్' సినిమాలో నటించిన తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ స్టార్ హీరోతో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రంలో సీత పాత్రలో కృతి నటిస్తోంది. అలానే వరుణ్ ధావన్ తో ‘భేడియా’.. టైగర్ ష్రాఫ్ సరసన ‘గణపథ్’.. అక్షయ్ కుమార్ సరసన ‘బచ్చన్ పాండే’ సినిమాలో కృతి హీరోయిన్ గా నటిస్తోంది.