ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. మొదటి సినిమా సమయంలో ఈ అమ్మడిని ముద్దుగుమ్మ అనడం కంటే బొద్దు గుమ్మ అనడం కరెక్ట్. ఆ సమయంలో కాస్త ఎక్కువ లావు ఉండేది. రెండు మూడు సినిమాల వరకు రాశిఖన్నా కాస్త ఎక్కువ బరువుతోనే కనిపించింది.
ఆ
తర్వాత టాలీవుడ్ లో ఇమడాలంటే.. ఇక్కడ సక్సెస్ లు దక్కించుకోవాలంటే
స్టార్స్ కళ్లలో పడాలంటే సన్నబడాలని తెలుసుకుంది. అందుకోసం కాస్త ఎక్కువ
కష్టపడింది... సన్నబడింది. ఈ అమ్మడు ఊహలు గుసగుసలాడే సినిమా తర్వాత వరుసగా
ఆఫర్లు దక్కించుకుంది.
పెద్ద హీరోల సినిమాల్లో ఒకటి రెండు ఛాన్స్ లు
వచ్చాయి. కాని స్టార్ హీరోయిన్ గా మాత్రం మారలేక పోయింది. యంగ్ హీరోలతో
సినిమాల్లో నటిస్తూ కెరీర్ ను నెట్టుకు వెళ్తున్న ఈ అమ్మడు మద్యలో కాస్త
గ్యాప్ వచ్చినా మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో తెలుగు మరియు
తమిళం కలిపి ఏకంగా ఆరు సినిమాలు ఉన్నాయి.
ఆ ఆరు సినిమాలు కూడా మంచి
అంచనాల నడుమ రూపొందుతున్నాయి. ముఖ్యంగా ఈ అమ్మడు తెలుగు లో నటిస్తున్న
పక్కా కమర్షియల్ మరియు చైతూతో కలిసి నటించిన థ్యాంక్యూ సినిమాలు చాలా
అంచనాలు కలిగి ఉన్నాయి. ఆ సినిమాలు సక్సెస్ దక్కించుకుంటాయని అంటున్నారు.
సినిమాలతోనే కాకుండా ఈ అమ్మడు రెగ్యులర్ గా హాట్ ఫొటో షూట్స్ తో కూడా
ఆకట్టుకుంటూ ఉంది.
తాజాగా ఈ ఫొటో షూట్ తో అదరగొట్టింది. ఈ ఫొటోలో
ఆమె చూపుకు ఎంతటి వారైనా విల విలలాడిపోవాల్సిందే కదా అన్నట్లుగా కొంటె
చూపులు చూస్తోంది. ఆ ఔట్ ఫిట్ మరియు ఆమె బాడీ లాంగ్వేజ్ కు యువరాణి
తరహాలో ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. అందంతో పాటు మంచి ఫిజిక్ కూడా ఈ
అమ్మడి సొంతం.
అందుకే ఇక ముందు ఈ అమ్మడికి ఖచ్చితంగా మంచి ఆఫర్లు
పెద్ద సినిమాల్లో స్టార్ హీరోలకు జోడీగా అవకాశాలు ఇవ్వాలని అభిమానులు
కోరుకుంటున్నారు. ఒక్క బడా హీరోతో కమర్షియల్ హిట్ పడితే ఈ అమ్మడు
అయిదేళ్లు వెనక్కు తిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలు
దక్కించుకుంటుందని అంటున్నారు.