రాశీ ఖన్నా జివ్వనిపించే ఫోజులు వైరల్

Thu Sep 16 2021 17:00:01 GMT+0530 (IST)

Raashii Khanna Promotions Pic for TughlaqDurbar

టాలీవుడ్ లో అత్యంత బ్యాడ్ లక్ వెంటాడిన హీరోయిన్ లలో రాశీఖన్నా గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సిందే. నాగశౌర్య నుంచి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరకు క్రేజీ స్టార్ లతో కలిసి నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. కానీ అవేవీ తనని స్టార్ హీరోయిన్ల జాబితాలో మాత్రం చేర్చలేకపోయాయి. మాస్ రాజా రవితేజతో చేసిన `బెంగాల్ టైగర్` ఫరవాలేదని పించినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేసిన `జై లవకుశ` ఆ ఆశల్ని ఆవిరి చేసింది.రాజా ది గ్రేట్.. ప్రతి రోజు పండగే హిట్ లుగా నిలిచినా రాశీ జోరుకు నితిన్ తో చేసిన `శ్రీనివాస కల్యాణం`... విజయ్ దేవరకొండతో చేసిన `వరల్డ్ ఫేమస్ లవర్` స్పీడ్ బ్రేకర్లుగా మారాయి. దీంతో చేసేది లేక తమిళ ఇండస్ట్రీ తలుపు తట్టింది. ఇక్కడ రాని గుర్తింపుని రాశి అక్కడ పొందడం మొదలుపెట్టింది. అక్కడ వరుస క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ తెలుగు మేకర్స్ ని ఆశ్చర్యపరుస్తోంది.

సుందర్ సి డైరెక్షన్ లో ఆర్య నటిస్తున్న హారర్ థ్రిల్లర్ `అరన్మనై 3`లో నటిస్తోంది. ఈ మూవీతో కొత్త ఇమేజ్ ని దక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇదిలా వుంటే విజయ్ సేతుపతితో కలిసి నటించిన `తుగ్లక్ దర్బార్` ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ హిట్ తో మంచి జోరుమీదున్న రాశిఖన్నా బ్లూ కలర్ ఔట్‌ఫిట్‌లో ప్రత్యేకంగా ఫొటోలకు పోజులిచ్చింది. లాబెల్డ్ డిజైనర్ వేర్ లో హోయలు పోతూ ఆ ఫొటోలని అభిమానులతో పంచుకుంది. వెరైటీ ఇయర్ రింగ్స్ తో పాటు రింగ్‌ని ధరించి స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది రాశీ ఖన్నా. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ ఫొటో షూట్ కి సంబంధించిన ఫొటోలు చూసిన వారంతా రాశీ ఖన్నా జోరు బహు హుషారు అంటూ కామెంట్ లు చేస్తున్నారు.