కామెడీ.. రొమాన్స్ లో రాశి కి ఏది ఇష్టమో తెలుసా..!

Wed Jun 29 2022 09:00:01 GMT+0530 (IST)

Raashi Reveals What She Likes To Do The Most

ఊహలు గుసగుసలాడే సినిమా తో హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకున్న రాశి ఖన్నా అప్పటి నుండి బిజీ బిజీగానే సినిమాలు చేస్తోంది. మొదటి సినిమాలో బొద్దుగా ముద్దుగా కనిపించిన రాశి ఖన్నా ఇప్పుడు మాత్రం సన్నగా నాజూకుగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. ఈ వారం పక్కా కమర్షియల్ సినిమా తో గోపీచంద్ తో కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.పక్కా కమర్షియల్ సినిమా లో రాశి ఖన్నా సీరియల్ ఆర్టిస్ట్ గా కనిపించబోతుందట. మంచి కామెడీ ఎంటర్ టైన్మెంట్ ను అందించే పాత్రలో తాను నటించినట్లుగా చెప్పుకొచ్చింది. గతంలో తనకు మంచి గుర్తింపు తీసుకు వచ్చిన పాత్రలు కూడా కామెడీ ఎంటర్ టైన్మెంట్ పాత్రలే అని.. అయితే తనకు కామెడీ సన్నివేశాల్లో నటించడం కంటే రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం కంఫర్ట్ అన్నట్లుగా చెప్పుకొచ్చింది.

కామెడీ సన్నివేశాల్లో నటించడం చాలా కష్టం. ఎదుటి వారి రియాక్షన్ కు తగ్గట్టుగా మన రియాక్షన్ ఉండాలి.. ఆ టైమింగ్ పై మంచి పట్టు ఉండాలి. అందుకే కామెడీ సన్నివేశాలు చేసే సమయంలో నేను చాలా ఎక్కువ హోమ్ వర్క్ చేయాల్సి వచ్చేది. అదే లవ్ కమ్ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు అన్నట్లుగా ఈ అమ్మడు తెలియజేసింది.

రాశి ఖన్నా ఇంకా మాట్లాడుతూ తనకు గుర్తింపు తెచ్చిన కామెడీ పాత్రల్లో నటించేందుకు చాలా కష్టపడ్డాను. ఆ కష్టం కు ఫలితం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో కామెడీ రోల్స్ ను ఈజీగా చేయగలదని నా పేరును చెబుతున్నప్పుడు చాలా గర్వంగా ఉంటుంది.

కామెడీ.. రొమాంటిక్ పాత్రల్లో నటించిన తనకు యాక్షన్ సన్నివేశాల్లో నటించాలనే కోరిక చాలా కాలంగా ఉంది. యాక్షన్ సన్నివేశాలు మరియు యుద్ద సన్నివేశాలు అంటే ఇష్టం. భవిష్యత్తులో తప్పకుండా అలాంటి సినిమాల్లో ఆఫర్లు వస్తాయని భావిస్తున్నాను అంది.