Begin typing your search above and press return to search.

ఆసనాలతో హీటేక్కిస్తున్న బూరెబుగ్గల సుందరి

By:  Tupaki Desk   |   5 April 2020 8:21 AM GMT
ఆసనాలతో హీటేక్కిస్తున్న బూరెబుగ్గల సుందరి
X
ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రాశీఖన్నా. ఆ సినిమాలో నాగశౌర్య సరసన మెరిసి తెలుగువారి హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతూ టాలీవుడ్ లో పాగా వేసుకు కూర్చుంది ఈ బూరెబుగ్గల సుందరి. జై లవకుశ - తొలిప్రేమ - జిల్ - శివమ్ - బెంగాల్ టైగర్ - సుప్రీమ్ - హైపర్ - రాజా ది గ్రేట్ - టచ్ చేసి చూడు - శ్రీనివాస కళ్యాణం సినిమాల ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. వరుస అవకాశాలు వస్తూనే ఉండడానికి కారణం వ్యక్తిత్వమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆమె ఇటీవల నటించిన 'వెంకీమామ' 'ప్రతిరోజూ పండగే' సినిమాలతో రెండు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంది. విజయ్ దేవరకొండతో నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫలితంతో ఓ భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది రాశీ. ఇదిలా ఉండగా ఫ్యాన్స్ కి సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాల ద్వారా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారు మతులుపోగొడుతూ ఉంటుంది.

క‌రోనా వైర‌స్ కారణంగా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ లాక్‌ డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు తమ అప్‌ డేట్స్‌ తో సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. తమలోని టాలెంట్లన్నీ బయటకి తీస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళ అభిమానులతో పంచుకుంటున్నారు. రాశీ ఖన్నా మాత్రం అందరికి డిఫరెంటుగా తన ఆరోగ్యంపై ఫోకస్ పెట్టి యోగాసనాలు వేస్తోంది. మీరు కూడా ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టండి అంటూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే రాశీఖన్నా చేతిలో ప్రస్తుతానికి ఏ తెలుగు సినిమా లేదు. తమిళ్‌లో ఓ రెండు సినిమాల్లో చేస్తుందని టాక్. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు దేవకట్టా- సాయి తేజ్ కాంబినేషన్‌ లో వస్తోన్న ఓ సినిమాలో రాశీని ఓ పాత్ర కోసం పరిశీలిస్తున్నారట. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఈమె నటించే సినిమాల గురించి తెలిసే అవకాశాలున్నాయి.