వైరల్: బ్యూటీ డ్యాన్స్ అదిరిందిగా

Tue Apr 23 2019 23:04:51 GMT+0530 (IST)

Raashi Khanna Workouts Video Viral in Social Media

టాలీవుడ్ లో గ్లామర్ ప్లస్ టాలెంట్ రెండూ ఉండి కూడా స్టార్ లీగ్ కు చేరలేకపోయిన హీరోయిన్లలో రాశి ఖన్నా ఒకరు. మొదట్లో అందరూ రాశిని గ్లామర్ డాల్ అనుకున్నారు కానీ వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' రిలీజ్ అయిన తర్వాత మాత్రం చాలామంది ఆ అభిప్రాయం మార్చుకున్నారు.  'శ్రీనివాస కళ్యాణం' పై భారీ ఆశలు పెట్టుకుంటే ఆ సినిమా కాస్తా నిరాశపరించింది. కానీ ఇప్పుడు క్రేజీ మల్టి స్టారర్ 'వెంకీమామ' లో చైతు సరసన హీరోయిన్ గా నటిస్తోంది.సినిమాలే కాకుండా రాశి అప్పుడప్పుడూ షోరూం ఓపెనింగ్స్ కు హాజరై రిబ్బన్స్ కట్ చేస్తూ ఉంటుంది.. యాడ్స్ లో కూడా మెరుస్తూ ఉంటుంది. రీసెంట్ గా అలానే ఒక యాడ్ షూటింగ్ లో పాల్గొంది. ఆ షూటింగ్ కు సంబంధించిన బిహైండ్ ది సీన్స్ వీడియో ను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది.  ఈ వీడియో కు "అటూ ఇటూ ఊగుతున్నాను. #బిహైండ్ ది సీన్స్.. #బ్రాండ్ షూట్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

వీడియోలో రాశి పింక్ కలర్ ఛోళీ.. లెహెంగా.. పైన అదే కలర్ మ్యాచింగ్ చున్నీ వేసుకొని సూపర్ గా డ్యాన్స్ వేస్తూ ఉంది. రాశితో పాటు మరో తొమ్మిది పది మంది సఖులు.. రాశి మాదిరిగానే  అటూ ఇటూ ఊగుతూ డ్యాన్స్ వేస్తున్నారు.  ఈ వీడియో మొత్తం మీద డ్యాన్స్ ఒక్కటే హైలైట్ అనుకుంటే మీకంటే తింగరి బుచ్చి ఎవరూ ఉండరు.. అందాలను గమనించడం.. ఆస్వాదించడం లో కూడా కాస్త నైపుణ్యం ఉండాలి.  అదేదో మీరే చెప్పి పుణ్యం కట్టుకోండి.. ఎంతసేపూ మేమే రాయాలా మీరు రాయరా? కనీసం స్పందన కూడా తెలపరా.. ఏం న్యాయం ఇది?

వీడియో కోసం చూడండి