Begin typing your search above and press return to search.

రాశీఖన్నా ఫిట్ నెస్ మంత్ర..

By:  Tupaki Desk   |   24 Jan 2021 2:56 PM GMT
రాశీఖన్నా ఫిట్ నెస్ మంత్ర..
X
హీరోయిన్ అంటే అందం, అభినయం మాత్రమే ఉంటే సరిపోదు. ఫిగర్ మెజర్ మెంట్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. కొలతలు తీసుకొని పక్కా షేప్ వచ్చేంత వరకూ చెక్కిన శిల్పంలా ఉండాలి. నాజూకు నడుమందాలతో కుర్రకారు గుండెల్లో కాకరేపాలి. అప్పుడే.. యూత్ ఫిదా అయిపోతారు. అలా అయితేనే.. నాలుగు ఛాన్సులు వస్తాయి.

అందుకే.. రాజభోగాలు అనుభవించే సకల సౌకర్యాలు చుట్టూ ఉన్నా.. మితాహారంతో జిహ్వ చాపల్యాన్ని అణుచుకుంటారు హీరోయిన్లు. అంతేకాదు.. చలిగిలి అని సాకులు చెప్పుకోకుండా పొద్దుగాలే నిద్రలేచి వర్కవుట్స్ చేస్తుంటారు. ఢిల్లీ భామ రాశీఖన్నా కూడా ఇదేవిధంగా కసరత్తులు చేస్తోంది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ తో ఓపెన్ ప్లేస్ లో తెగ కష్టపడిపోతోందీ బ్యూటీ.

ఇక‌, సినిమాల విష‌యానికి వ‌స్తే.. తెలుగులో పలు సినిమాల్లో నటించి అలరించిన రాశీ.. తమిళ్ ఇండస్ట్రీలో వరుస ఛాన్సులతో దూసుకెళ్తోంది. అయితే.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తరువాత టాలీవుడ్లో మరో సినిమాకు సంతంకం చేయలేదు రాశీ. అయితే.. తాజాగా ఓ బంపర్‌ ఆఫర్‌ వచ్చిందట. మెగాహీరో సాయిధరమ్‌ తేజ్ సినిమాలో మ‌ళ్లీ ఛాన్స్ కొట్టేసిందట.

వీరిద్ద‌రి కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి సుప్రీం కాగా.. మరొకటి ప్రతిరోజూ పండగే. ఈ రెండు సినిమాలూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి జోడీ కట్టబోతున్న ఈ జంట.. హ్యాట్రిక్ పై కన్నేసింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందని తెలుస్తోంది. త్వ‌ర‌లో వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.