అందం హిందోళం.. అనిపిస్తున్న ఢిల్లీ సుప్రీం భామ!!

Mon Aug 03 2020 15:40:48 GMT+0530 (IST)

Raashi Khanna Pink Dress Pic Goes viral

ఢిల్లీ భామ రాశీఖన్నా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. రాశి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం అభినయంతో కుర్రకారు మనసును దోచుకుంటుంది. మొదటగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ.. 2014లో ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగుతెరపై అడుగు పెట్టింది. అమ్మడి ఫస్ట్ సినిమా మంచి హిట్ అందుకోవడంతో యూత్ బాగా కనెక్ట్ అయిపోయారు. బాలీవుడ్ మద్రాస్ కేఫ్ నుండి టాలీవుడ్ పై ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన రాశి.. సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ మంచి మార్కులే కొట్టేస్తుంది. తన లేత అందాలను బెంగాల్ టైగర్ మూవీతో గుప్పించడం మొదలుపెట్టింది. అప్పటి నుండి వరుస అవకాశాలతో స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తోంది. కెరీర్ లో జిల్ బెంగాల్ టైగర్ తొలిప్రేమ జైలవకుశల తో పాటు రీసెంట్ గా పండగచేస్కో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక మధ్యలో నితిన్ సరసన శ్రీనివాస కళ్యాణం చేసినా అది బోల్తా కొట్టడంతో కెరీర్ డైలమాలో పడింది.ఇటీవలే వెంకిమామతో డీసెంట్ హిట్ అందుకుంది. 2018లో ఇమైక నొడిగళ్ సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఇటీవలే విజయ్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసిందని టాక్. అమ్మడు ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తుంది. ప్రస్తుత లాక్‌డౌన్ సమయాన్ని రాశి బాగా ఉపయోగించుకుంటుందట. ఇటీవలే సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో అడిగిన సందేహాలకు ఎంతో ఓపికతో సమాధానం ఇచ్చింది. లాక్‌డౌన్ టైంలో పుస్తకాలు చదవడంతో పాటు ఇన్‌స్పిరేషన్ కలిగించే వీడియోలు ఈ భామ చూస్తుందట. ఇదిలా ఉండగా తాజాగా రాశి ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పిక్ షేర్ చేసింది. ఆ ఫోటోలో రాశిని చూస్తూ కుర్రాళ్ళు.. అందం హిందోళం అధరం తాంబూలం.. అంటూ సాంగ్ పాడుకుంటున్నారు. సింపుల్ పింక్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. అందమైన స్మైల్ ఇచ్చిన రాశి పిక్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.