Begin typing your search above and press return to search.

ప్ర‌కృతిలో మ‌మేకం అయినా రాశీలో ఏదో తెలీని నిర్లిప్త‌త‌?

By:  Tupaki Desk   |   4 March 2021 4:30 PM GMT
ప్ర‌కృతిలో మ‌మేకం అయినా రాశీలో ఏదో తెలీని నిర్లిప్త‌త‌?
X
ప్ర‌తిభ ఉంటే టాలీవుడ్ స‌హా సౌత్ ఇండ‌స్ట్రీస్ లో అవ‌కాశాల‌కు కొద‌వేమీ లేదు. తెలుగు-త‌మిళ‌-మ‌ల‌యాళ భాష‌ల్లో మూడుముక్క‌లాట‌కు అల‌వాటు ప‌డితే ఛాన్సులే ఛాన్సులు. ఇదిగో అందాల రాశీ ఖ‌న్నా ప్ర‌స్తుతం చేస్తున్న‌ది అదే. ఇటు టాలీవుడ్ లో క్రేజు త‌గ్గ‌గానే పొరుగు భాష‌ల్లో ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ప్ర‌స్తుతం త‌మిళంలో ఏకంగా నాలుగు సినిమాలు చేస్తోంది. మ‌ల‌యాళంలో ఒక సినిమా చేస్తోంది.

వెంకీ మామ‌- ప్ర‌తిరోజు పండ‌గే హిట్లు అయినా వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ ఫ్లాపైంది. ఆ త‌ర్వాత ఎందుక‌నో తెలుగు చిత్రసీమ‌లో రాశీకి అవ‌కాశాల్లేవ్. పైగా ఇక్క‌డ గ్యాప్ ఇవ్వాల‌నే రాశీ త‌మిళంకి ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

ఇక‌పోతే రాశీఖ‌న్నా సోష‌ల్ మీడియాల్లోనూ గొప్ప ఫాలోయింగ్ పెంచుకునే ప‌నిలో ఉంది. అక్క‌డ నిరంత‌రం ఏదో ఒక కొత్త ఫోటోషూట్ తో ట్రీటిస్తోంది. తాజాగా రాశీ ప‌డ‌వ ప్ర‌యాణంలో నేచుర్ ని ఆస్వాధిస్తున్న ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతోంది. అన‌గ‌న‌గా ఒక సాయం సంధ్య వేళ అలా ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త‌ను ఆస్వాధించే ప‌నిలో రాశీ విహారం ఆహ్లాదాన్ని పంచుతోంది. ఎంతో ప్లెజెంట్ గా ఉన్న ఈ వాతావ‌ర‌ణంలో రాశీ లుక్ అంతే వేడెక్కిస్తోంది. బ్లాక్ టాప్ లో రాశీ అందాలు గ‌మ్మ‌త్తుగా విందు చేస్తున్నాయ్. ప్ర‌కృతిలో మ‌మేకం అయినా రాశీలో ఏదో తెలీని నిర్లిప్త‌త కూడా హైలైట్ అవుతోంది. తుఫాన్ ముందు నిశ్శ‌బ్ధంలా క‌నిపిస్తోంది రాశీ.

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో రాశీ ఖ‌న్నా కెరీర్ ఏమంత ఆశాజ‌న‌కంగా లేదు. అటు త‌మిళంలో మాత్రం నాలుగు చిత్రాలు చేస్తోంది. సైతాన్ కా బ‌చ్చా రిలీజ్ కావాల్సి ఉంది. ఆర‌ణ్మ‌యి 3- తుగ్ల‌క్ ద‌ర్బార్- మేధావి సెట్స్ పై ఉన్నాయి. భ్ర‌మం అనే మ‌ల‌యాళ చిత్రంలోనూ న‌టిస్తోంది. ఈ లాక్ డౌన్ గ్యాప్ లో పూర్తిగా స్లిమ్ అయిన‌ రాశీ ద‌ర్శ‌క‌ద్వయం రాజ్ అండ్ డీకే తెర‌కెక్కించే వెబ్ సిరీస్ కి సంతకం చేసింది. ఇందులో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో న‌టిస్తున్నారు.