ఫోటో స్టొరీ: స్పైసీమహోత్సవం!

Tue Sep 10 2019 12:03:26 GMT+0530 (IST)

Raashi Khanna Glamourous Pose

మన టాలీవుడ్ లో ఉండే గ్లామరస్ భామల్లో రాశి ఖన్నా ఒకరు.  ఈమధ్య కొత్త భామల రాకతో రాశి హవా కాస్త తగ్గినట్టు అనిపించింది కానీ అలా ఏం లేదు. తనదైన శైలిలో చెలరేగిపోతూ గ్లామర్ ప్రపంచానికి కొత్త గ్రామర్ సెట్ చేస్తూనే ఉంది.  రాశి సోషల్ మీడియాలో యాక్టివ్ అనే సంగతి తెలిసిందే.  ఇన్స్టాలో ఈ భామకు 3.6 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. వారికోసం రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది.రాశి ఈమధ్య అంగరంగవైభవంగా జరిగిన సినీ మహోత్సవం వేడుకకు హాజరైంది. అసలే గ్లామరస్ బ్యూటీ.. టాలీవుడ్ ప్రముఖులు పాల్గొనే భారీ ఈవెంట్ కావడంతో అందంగా తయారైంది.  ఆ డ్రెస్ లో ఒక ఫోటో షూట్ కూడా చేసింది.  ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా రీసెంట్ గా పోస్ట్ చేసింది.  స్లీవ్ లెస్ గ్రే కలర్ లాంగ్ గౌన్ లో రాశి అందాల బొమ్మలా కనిపిస్తోంది. తన డ్రెస్ కు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ ధరించి.. పర్ఫెక్ట్ మేకప్ తో అందరినీ క్లీన్ బౌల్డ్ చేస్తోంది.  పనిలో పనిగా కాస్త అందాల వడ్డన కూడా చేసేసింది. ఇలాంటి లుక్స్ తో సినీమహోత్సవం వేడుకలో రాశి తన స్పైసీమహోత్సవంతో తప్పనిసరిగా అందరి దృష్టిని ఆకర్షించి ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఈ ఫోటోకు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.  "థోడా స్పైసీ థోడా సెక్సీ".. "సూపర్ సెక్సీ బ్యూటీ".. "సదా సెక్సీ రహో" అంటూ కామెంట్లు పెట్టారు.  ఇక రాశి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తెలుగులో 'వెంకీ మామ' లో నటిస్తోంది.  తమిళంలో 'షైతాన్ కా బచ్చా'.. 'కడైసి వ్యవసాయి'.. 'సంగ తమిళన్' అనే సినిమాల్లో నటిస్తోంది.