లక్ష్మీరాయ్ అప్పుడే అమ్మమ్మ... హౌ?

Wed Jul 11 2018 16:39:49 GMT+0530 (IST)

నా ఇద్దరు బిడ్డలకి మరో ఇద్దరు. నా ప్రపంచం మరింత పెద్దదైంది. అమ్మమ్మ కావడం ఎంత గర్వంగా ఉందో అంటూ ఆ నలుగురికీ సపరిచర్యలు చేస్తూ ఆస్పత్రిలో ఆనందంగా గడుపుతోంది  లక్ష్మీరాయ్.  అదే విషయాన్ని ఆనందంగా ట్వీట్ చేసి తన  అభిమానులతోనూ పంచుకుంది. అసలు లక్ష్మీరాయ్ ఏంటి? అమ్మమ్మ  కావడమేంటి?  అసలు ఆమెకి పెళ్లే కాలేదు కదా అంటారా?నిజమే... కానీ ఆమె మియు - లియు అనే రెండు కుక్క పిల్లల్ని పెంచుకొంది. వాటిని తన బిడ్డలకంటే ఎక్కువగా చూసుకొంటోంది. అయితే ఆ రెండు కుక్కపిల్లలకి ఇటీవల మరో రెండు బిడ్డలు పుట్టాయి. అలా లక్ష్మీరాయ్ అమ్మమ్మైందన్నమాట. వాటికి టిఫాని - పకో అని నామకరణం చేసి అమ్మమ్మయ్యానోచ్ అని ప్రకటించుకొంది లక్ష్మీరాయ్. అదీ అసలు సంగతి. `నా ఈడు అమ్మాయిలు  చాలామంది ఇప్పటికే తల్లయ్యారు.  కానీ నేను ఏకంగా అమ్మమ్మనే అయ్యాను` అంటూ  తన ముద్దుల కుక్కపిల్లలతో ఆడుకుంటూ సరదా సరదాగా గడుపుతోంది లక్ష్మీరాయ్. ఈమె `జూలీ2`తో హిందీలో రాణించే ప్రయత్నం చేసింది. కానీ కలిసి రాలేదు. అయినా లక్ష్మీరాయ్ అందం మహిమవల్ల దక్షిణాదిలో ఆఫర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ప్రస్తుతం తమిళం - మలయాళం భాషల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.  తెలుగులో `కాంచనమాల కేబుల్ టీవీ`తో పరిచయమైన ఆమె క్రమం తప్పకుండా అవకాశాలు అందుకొంటూనే ఉంది.