పెద్ద పులితో రత్తాలు లైవ్ యాక్షన్ దుమారం

Sun Sep 22 2019 15:00:54 GMT+0530 (IST)

Raai Laxmi Fight with Tiger

ఐటెమ్ సాంగ్స్ బోరింగ్.... హారర్ థ్రిల్లర్ పాత ట్రెండ్ అయిపోయింది. అందుకే రత్తాలు రూటు మార్చింది. ఇకపై పెద్ద పులితో పోరాడుతోందట. అసలు రత్తాలు ఎక్కడ ఉంటే అక్కడ రచ్చ రచ్చే. సోషల్ మీడియా వెల్లువలో బికినీ ట్రీట్ ఇస్తున్న రత్తాలు సరికొత్తగా యాక్షన్ క్వీన్ అవతారం ఎత్తుతోంది. ఇన్నాళ్లు సరైన సక్సెస్ లేకపోయినా నలుగురి నోట్లో నానేందుకు రత్తాలు చేయాల్సిందంతా చేస్తోంది.సినీకెరీర్ వరకూ తెలివిగా హారర్ థ్రిల్లర్లతో బండి నెట్టుకొస్తోంది. రాయ్ లక్ష్మీ కేరాఫ్ హారర్ టెర్రర్ అన్నంతగా పాపులారిటీ సంపాదించింది. దెయ్యం పాత్రలతో ధడ పుట్టిస్తోంది. మధ్యలో వీలున్న ప్రతిసారీ స్పెషల్ గీతాలతోనూ మెరుపులు మెరిపిస్తోంది. ఇన్నాళ్లు ఆ ఒకటి రెండు జోనర్లనా అనుకుందేమో.... ఇప్పుడు ఉన్నట్టుండి యాక్షన్ క్వీన్ అవతారం ఎత్తేసింది. తమిళంలో శక్తికుమార్ రూపొందిస్తున్న హారర్ థ్రిల్లర్ `మిరుగ`లో ఫైట్స్ తో దడ పుట్టించనుందట. ఈ చిత్రంలో `రోజా పూలు` ఫేమ్ విక్రమ్ అలియాస్ శ్రీకాంత్ హీరోగా నటించారు. ఈ సినిమాలో హీరోకి ధీటుగా ఫైట్స్ చేసి అదరగొట్టబోతోందట. తాజాగా రిలీజైన ఫోటోలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఆసక్తికరంగా ఈ చిత్రంలో రత్తాలు బిడ్డకు తల్లిగా నటిస్తోంది. పదేళ్ల పాపకు తల్లిగా రాయ్ లక్ష్మి  ఝాన్సీ రాణిని తలపిస్తుందట. ఈ చిత్రంలో ఎక్కడి నుంచో ఓ పులి వచ్చి ఫామ్ హౌజ్ లో వున్న వాళ్లని లాక్కెళ్లి చంపేస్తుంటుంది. దాన్ని సీజీలో క్రియేట్ చేశారు. ఆ పులితో పోరాడే ఘట్టాల కోసం రాయ్ లక్ష్మిపై కీలక సన్నివేశాల్ని దర్శకుడు శక్తికుమార్ ఇటీవలే చిత్రీకరించారు. ఈ సన్నివేశాల్లో పులి కనిపించకపోయినా నిజమైన పులితో పోరాడుతున్నట్టే వీఎఫ్ ఎక్స్ వర్క్ చేయిస్తున్నారట. పైగా రోప్స్ సహాయంతో ఆ పులితో పోట్లాడుతున్నట్టు కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఈ సీన్స్ కోసం రాయ్ లక్ష్మీ చాలా శ్రమించాల్ని వచ్చిందట. రత్తాలుపై ఈ సినిమాలో చిత్రీకరించిన పోరాట ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం చెబుతోంది. అయితే పులితో ఫైట్ కి సంబంధించిన లుక్ ని రివీల్ చేయాల్సి ఉందింకా.