ఫోటో స్టొరీ: బికిని కోసమే పుట్టిందా?

Wed Jul 17 2019 17:27:42 GMT+0530 (IST)

తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేని పేరు రాయ్ లక్ష్మి.  ఒకవేళ కొందరికి ఆ పేరు తెలియకపోయినా రత్తాలు అనగానే వెంటనే గుర్తుపడతారు. 'ఖైది నెం. 150' సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి రత్తాలు రత్తాలు అనే చార్ట్ బస్టర్ పాటకు స్టెప్పులేయడంతో అమ్మడి క్రేజ్ డబల్ అయింది.  అప్పటి నుంచి టాలీవుడ్ రత్తాలుగా మారింది. ఐటమ్స్ సాంగ్స్ తో పాటు అప్పుడప్పుడూ హీరోయిన్ గా కూడా నటించే రాయ్ లక్ష్మి పోయినేడాది 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' అనే హారర్ కామెడీ సినిమాలో నటించింది కానీ అది ఫ్లాప్ అయింది. కానీ సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా తన ఘాటు ఛాయాచిత్రాలతో సామాజిక మాధ్యమాలను వేడిక్కిస్తుంది.. అంతర్జాలాన్ని అతలాకుతలం చేస్తుంది.తాజాగా తన ఘాటు ట్రెండును కొనసాగిస్తూ ఒక  ఫోటోను పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు రాయ్ లక్ష్మి చాలా పెద్ద క్యాప్షన్ ఇచ్చింది "ఈ బికినీ బాడీ కోసం చాలా కష్టపడ్డాను. నేను ఇంతకుముందు ఎలా ఉన్నానో ఇప్పుడు గుర్తు కూడా లేదు! జీవితం అంతా పెరగడం తగ్గడంతోనే సరిపోయింది! ఫైనల్ గా నేనో కొత్త మనిషిలాగా ఫీల్ అవుతున్నాను. నాలో వచ్చిన మార్పును నేను ఇష్టపడుతున్నాను.  ఎందుకంటే.. ఫిట్ అంటే జస్ట్ శారీరకంగా వచ్చే మార్పు మాత్రమే అనుకోవడం లేదు.. ఓవరాల్ గా మనిషిలో వచ్చిన మార్పు. గైస్.. మీరు కూడా ఏదైనా సాధించగలరు  అని మీరు నమ్మండి.  మీరేదైతే మార్చడం లేదో దాన్ని మీరు ఎంచుకుంటున్నట్టే!! దీన్ని మరోసారి చదవండి" అంటూ ఫిట్నెస్ ఫిలాసఫీ చెప్పింది.

ఫిలాసఫీ సంగతేమో కానీ ఫోటో మాత్రం అదిరిపోయింది.  బ్లూ కలర్ బికినీలో చిరునవ్వులు చిందిస్తూ ఒక గోడకు చేతులను ఆన్చి ఖజురహో శిల్పం 2.0 లాగా కనిపిస్తోంది.  తడి జుట్టు.. కళ్ళకు గాగుల్స్ తో హాట్ మీటర్ ను మరింతగా పెంచింది.  ఒక్క గ్రాము కూడా అనవసరమైన ఫ్యాట్ లేకుండా పర్ఫెక్ట్ షేప్ లో ఉంది.. అసలు బికినీ కోసమే జన్మ ఎత్తిన అందాల అప్సరస తరహాలో ఉంది.  అందుకే  ఈ ఫోటో నెటిజన్లకు కూడా తెగ నచ్చింది. "సూపర్ హాట్ బికినీ".. "స్టన్నింగ్ బ్యూటీ".. "సెక్సీ బికినీ.. కిల్లింగ్ పోజు" అంటూ కామెంట్లు పెట్టారు.  ఇక రాయ్ లక్ష్మి సినిమాల విషయానికి వస్తే తమిళంలో 'సిండ్రెల్లా' అనే చిత్రంలోనూ.. కన్నడలో 'ఝాన్సి' అని మూవీలోనూ నటిస్తోంది.