Begin typing your search above and press return to search.

RRR: టైటిల్ మైనస్ గా మారుతోందా??

By:  Tupaki Desk   |   26 Feb 2020 6:30 AM GMT
RRR: టైటిల్ మైనస్ గా మారుతోందా??
X
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం భారీ బడ్జెట్ తో 'RRR' చిత్రం రూపొందిస్తున్నారు. రామ్ చరణ్.. ఎన్టీఆర్ లు హీరోలుగా దాదాపు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'బాహుబలి' రెండు భాగాలు ఘనవిజయం సాధించిన తర్వాత జక్కన్న దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 'బాహుబలి' స్థాయిలో జరుగుతోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అంతా బాగానే ఉంది కానీ ఒక విషయంలో ఈ సినిమాపై నెగెటివ్ కామెంట్ వినిపిస్తోంది.

ఈ సినిమా టైటిల్ ఇప్పటివరకూ ఏంటో తేల్చలేదు జక్కన్న. రాజమౌళి.. రామారావు.. రామ్ చరణ్ పేర్లలో R అక్షరాలను తీసుకుని ఒక చోట చేర్చి ఒక #RRR అంటూ వర్కింగ్ టైటిల్ తరహాలో ప్రకటించారు. ఈ సినిమా గురించి ప్రస్తావించినప్పుడు 'RRR' పేరే వాడుతున్నారు. అయితే ఈ టైటిల్ ఫైనల్ గా ఉంటుందా లేదా కొత్త టైటిల్ ప్రకటిస్తారా అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. గతంలో ప్రేక్షకులను RRR కు సెట్ అయ్యే టైటిల్ సూచించమని కూడా కోరారు. ఆ సలహాలు సూచనల సంగతి ఇప్పుడు అందరూ మర్చిపోయారు. RRR అనే టైటిల్ 'బాహుబలి' స్థాయిలో బ్రాండ్ గా మారడం కష్టం.. ఎందుకంటే 'బాహుబలి' టైటిల్ ను చాలాముందుగా ప్రకటించి ప్రచారం చెయ్యడంతో అది ప్రజల్లోకి చొచ్చుకునిపోయింది. జక్కన్న మార్కెటింగ్ స్ట్రేటజీలు కూడా వర్క్ అవుట్ అయ్యాయి. ఇప్పుడు బీ.. సి సెంటర్లలో ఎవరికైనా #RRR అంటూ టైటిల్ చెప్తే అదేంటని అడుగుతున్నారు. కొందరైతే అది బట్టలదుకాణం పేరులా ఉందని అంటున్నారు.

దీంతో ట్రేడ్ వర్గాలలలో కూడా కొంత ఆందోళన నెలకొందని అంటున్నారు. ఈ సినిమాకు ఏదైనా క్యాచీ టైటిల్ ప్రకటిస్తే అన్నీవర్గాల వారికి అది చేరువ అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.. జక్కన్న త్వరగా టైటిల్ ను ప్రకటిస్తే రిలీజ్ సమయానికి అది బ్రాండ్ గా మారే అవకాశం ఉంటుందని.. టైటిల్ విషయం ఇంతకంటే ఆలస్యం చేయడం మంచిది కాదనే వాదన వినిపిస్తోంది.