Begin typing your search above and press return to search.

'రామరాజు ఫర్ భీమ్' ముహూర్తం ఖరారు చేసిన 'RRR' టీమ్..!

By:  Tupaki Desk   |   20 Oct 2020 9:30 AM GMT
రామరాజు ఫర్ భీమ్ ముహూర్తం ఖరారు చేసిన RRR టీమ్..!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న తరుణం మరో రెండు రోజుల్లో రాబోతోంది. నందమూరి తారకరాముడు నటిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' నుంచి ఎన్టీఆర్ కి సంబంధించిన స్పెషల్ వీడియో ఈ నెల 22న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. 'రామరాజు ఫర్ భీమ్' పేరుతో రానున్న ఈ టీజర్ ముహూర్తం ఖరారు చేసింది చిత్ర యూనిట్. అక్టోబర్ 22న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో 'రామరాజు ఫర్ భీమ్' రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడిస్తూ 'RRR' టీమ్ వెల్లడించింది. ఇప్పటికే విడుదలైన 'భీమ్ ఫర్ రామరాజు' సెన్సేషన్ క్రియేట్ చేయగా.. 'రామరాజు ఫర్ భీమ్' ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

కాగా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' మూవీలో రామ్ చరణ్ 'అల్లూరి సీతారామరాజు'గా.. ఎన్టీఆర్ 'కొమరం భీమ్'గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కతున్న ఈ మూవీలో అజయ్ దేవగన్ - శ్రియా శరణ్ - సముద్రఖని - అలియా భట్ మరియు ఐరిష్ బ్యూటీ ఒలివియా - అలిసన్ డూడీ - రే స్టీవెన్‌సన్ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. కరోనా కారణంగా గత ఏడున్నర నెలలుగా నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమై శరవేగంగా జరుపుకుంటోంది.