Begin typing your search above and press return to search.

దుబాయ్ లో 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ?

By:  Tupaki Desk   |   27 Oct 2021 5:59 AM GMT
దుబాయ్ లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ?
X
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. జక్కన్న చెక్కుతోన్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవ్ గన్, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, హాలీవుడ్ నటి ఓవియా నటిస్తోన్న ఈ భారీ మల్టీస్టారర్ మరో బాహుబలి కానుందని అంచనాలున్నాయి.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ గ్లింప్స్, దోస్తీ పాట ప్రేక్షకులు ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి కొమురం భీంగా తారక్, అల్లూరి సీతరామరాజుగా చెర్రీల లుక్ వైరల్ అయింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీని విడుదల చేయబోతున్నట్టుగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర అప్డేట్ చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రాజమౌళి భారీ స్థాయిలో దుబాయ్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుబెట్టేందుకు రెడీ అవుతోన్నజక్కన్న...ఈ నెల 29వ తేదీన ఆర్ఆర్ఆర్ మూవీ టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. పనిలో పనిగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కూడా ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టారట. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ లేకపోయినప్పటికీ....దుబాయ్ లోనే ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది. కరోనా కేసులు తక్కువగా ఉన్న నేపథ్యంలో దుబాయ్ లోనే ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ నిర్వహించారు.

అందుకే భారీగా నిర్వహించే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్కడే నిర్వహించేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంచి క్రేజ్ ఉంది. అందుకే, ఆర్ఆర్ఆర్ మూవీని వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే వరల్డ్ వైడ్‌గా ఉన్న ఆడియెన్స్ ను ఆకర్షించేందుకు రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. జక్కన్న చెక్కుతోన్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవ్ గన్, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, హాలీవుడ్ నటి ఓవియా నటిస్తోన్న ఈ భారీ మల్టీస్టారర్ మరో బాహుబలి కానుందని అంచనాలున్నాయి.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ గ్లింప్స్, దోస్తీ పాట ప్రేక్షకులు ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి కొమురం భీంగా తారక్, అల్లూరి సీతరామరాజుగా చెర్రీల లుక్ వైరల్ అయింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీని విడుదల చేయబోతున్నట్టుగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర అప్డేట్ చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రాజమౌళి భారీ స్థాయిలో దుబాయ్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుబెట్టేందుకు రెడీ అవుతోన్నజక్కన్న...ఈ నెల 29వ తేదీన ఆర్ఆర్ఆర్ మూవీ టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. పనిలో పనిగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కూడా ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టారట. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ లేకపోయినప్పటికీ....దుబాయ్ లోనే ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది. కరోనా కేసులు తక్కువగా ఉన్న నేపథ్యంలో దుబాయ్ లోనే ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ నిర్వహించారు.

అందుకే భారీగా నిర్వహించే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్కడే నిర్వహించేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంచి క్రేజ్ ఉంది. అందుకే, ఆర్ఆర్ఆర్ మూవీని వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే వరల్డ్ వైడ్‌గా ఉన్న ఆడియెన్స్ ను ఆకర్షించేందుకు రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.